ఇప్పుడు ఏపీలో టీడీపీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు విధానాలు లోకేష్ జోక్యం అన్నీ కూడా ఆ పార్టీ నెత్తిన కూర్చున్నాయి. ఇక ప్రతీ విషయంలో చినబాబు జోక్యం చంద్రబాబు తో సన్నిహితంగా ఉండే సీనియర్లను కూడా ఇబ్బంది పెడుతుంది అని చెప్పవచ్చు. ఇటీవల శాసన మండలి, శాసన సభ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో లోకేష్ బాబు మండలి లో చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదని అంటున్నారు కొందరు టీడీపీ ఎమ్మెల్సీలు. 

 

బడ్జెట్ ప్రసంగం కి ముందు గవర్నర్ మాట్లాడుతూ ఉండగా టీడీపీ నేతలు గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలుపుతూ బయటకు వచ్చారు. ఎమ్మెల్సీలు మాత్రం సభలోనే ఉండిపోయారు. ఎమ్మెల్సీలను రావాలి అని చెప్పినా సరే వారు మాత్రం ఆలస్యంగా వచ్చారు. మండలి పక్ష నేతగా ఉన్న యనమల తనకు సూచనలు ఉన్నాయి అని... అందరూ రావాలి అని సూచనలు చేసినా సరే టీడీపీ నేతలు మాత్రం రాలేదు. దీనికి కారణం లోకేష్ అని సమాచారం. ఆయన తనకు సమాచారం లేదని... తన మాట కాదని ఎవరూ బయటకు వెళ్ళకండి అంటూ యనమల మాటను ధిక్కరించారు అని సమాచారం. 

 

దీంతో సీనియ‌ర్ నేత‌గా ఉన్న య‌న‌మ‌ల ఇప్పుడు టీడీపీ నేత‌ల్లో ఎంత డ‌మ్మీయో అర్థ‌మవుతోంది. ఒక్క య‌న‌మ‌ల మాత్ర‌మే.. మాజీ హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన రాజ‌ప్ప నుంచి ఎంతో మంది సీనియ‌ర్లు సైతం ఇప్పుడు లోకేష్ బాబు అంటూ చేతులు క‌ట్టుకోవాల్సిన ప‌రిస్థితులే టీడీపీలో ఉన్నాయ‌ట‌. పార్టీ ఘోరంగా ఓడిపోయినా కూడా లోకేష్ దిగి రాక‌పోవ‌డంతో పాటు తాను చెప్పిందే వేదం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో దీనిపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: