రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం ఏడాది పాల‌న పూర్తి చేసుకుంది. నిజానికి రాష్ట్రంలో జ‌గ‌న్ అధికారంలోకి రావ ‌డం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఎంత‌గా ఇష్టం లేదో.. అంత‌కు మించి.. ఎల్లో మీడియాకు కూడా అస్స‌లు ఇ ష్టం లేదు. దీంతో జ‌గ‌న్ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచి కూడా విమ‌ర్శ‌లు, వ్య‌తిరేక వార్త‌లు వ‌స్తు న్నాయి. పోనీ.. ఏదైనా ఓ కీల‌క ప‌థ‌కం ప్ర‌వేశ పెట్టిన‌ప్పుడో.. దిశ వంటి కీల‌క మ‌హిళా చ‌ట్టాల‌ను చేసినప్పు డో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఏమైనా క‌నీసం ప్ర‌శంసించారా? అంటే.. అది కూడ‌లేదు. అదేస‌మ‌యంలో క‌రోనా నియంత్ర‌ణ‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి ముంద‌స్తుగా చేసిన వేల సంఖ్య‌లో ప‌రీక్ష‌ల కార‌ణంగా.. కొంత వ‌ర‌కు రోగుల‌ను ముంద‌స్తుగానే గుర్తించారు.

 

దీంతో క‌రోనా ఉధృతి చాలా వ‌ర‌కు బెట‌ర్ అయింది. మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఈ విష‌యంలోనూ ఎల్లో మీడియా మౌనం పాటించింది. కానీ, ఇప్పుడు ఏడాది పూర్తి చేసుకున్న త‌ర్వాత‌.. ఈ ఏడాది పాల‌న‌లోనూ జ‌గ‌న్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని పేర్కొంటూ .. ఓ వారం రోజుల పాటు ప్ర‌త్యేక క‌థ‌నాలు ప్ర‌చురించాల ‌ని, అన్నీ ఫుల్ యాంటీగా రాయాల‌ని ఎల్లో మీడియా నిర్ణ‌యించింది. రాజ‌ధాని అంశం నుంచి ఇసుక వ‌ర‌కు అన్ని అంశాల‌ను కూడా జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా తీసుకుని కుమ్మేయాల‌ని అనుకున్నారు. దీనికి సంబంధించి ప‌క్కా ప్లాన్ కూడా సిద్ధ‌మైంది. 

 

కానీ, ఇంత‌లోనే దీనికి బ్రేక్ ప‌డింది. మొత్తంగా వ్య‌తిరేక క‌థ‌నాలు రాసుకుంటూ పోతే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని ఎల్లో మీడియా అధిష్టానం సందేహంలో ప‌డింది. ఎందుకంటే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్పుడు ఏ ప‌ని చేస్తున్నా.. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసిన ప‌నుల‌కు కొన‌సాగింపుగానే చూడాలి. ఏవో కొన్ని సంక్షేమ ప‌థ‌కాలు మాత్ర‌మే జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా ప్ర‌వేశ పెట్టుకు న్నా.. మిగిలిన వాటిని మాత్రం కొన‌సాగింపుగానే భావించాలి. 

 

దీంతో ఇందులో అవినీతిజ‌రిగింది.. అందులో అవినీతి జ‌రిగింద‌నే విష‌యాల‌ను త‌వ్వి తీస్తే.. బాబు, ఆయ‌న ప‌రివారమే అడ్డంగా బుక్క‌య్యే ఛాన్స్ ఉంద‌ని చివ‌రి నిముషంలో గుర్తించిన ఎల్లో మీడియా.. ఈ విష‌యాన్ని మౌనంగా ప‌క్క‌కు త‌ప్పించేసింద‌ట‌! అంటే.. మ‌న‌సులో జ‌గ‌న్‌ను విమ‌ర్శించాల‌ని, జ‌గ‌న్ స‌ర్కారును రోడ్డున ప‌డేయాల‌ని ఎంతో క‌సి ఉన్న‌ప్ప‌టికీ.. ఏవిష‌యాన్ని ట‌చ్ చేసినా.. చంద్ర‌బాబు అడ్డంగా బుక్క‌వుతార‌నే కార‌ణంగా వెనుకంజ వేస్తున్న‌ద‌ట ఎల్లో మీడియా! సో.. అదీ విష‌యం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: