టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కొడుకు, మాజీ మంత్రి లోకేష్ కి సీఎం జగన్ ముహూర్తం పెట్టేసారా..? వారి అవినీతి పుట్ట పగలబోతుందా..? త్వరలోనే వారిని జైలుకి పంపే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారా..? ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారా..? అంటే అవుననే తెలుస్తుంది. ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సమావేశం కానుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలో గల సచివాలయంలో కేబినెట్ భేటీ కాబోతోంది. అయితే ఈ కేబినెట్ భేటీలోనే సీఎం జగన్, చంద్రబాబుకి చెక్ పెట్టబోతున్నట్టు సమాచారం. చంద్రబాబు ప్రభుత్వ హాయంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై ఇప్పటికే మంత్రివర్గం సీబీఐతో దర్యాప్తు చేయించడానికి తీర్మానించిన విషయం తెలిసిందే.

 

అయితే ఇప్పుడు జరగబోయే భేటీలో ఈ దర్యాప్తును మరింత ముమ్మరం చేసేలా కీలక నిర్ణయాలను తీసుకుంటారని తెలుస్తుంది. అలాగే ఈఎస్ఐ కుంభకోణంలో ఇప్పటిదాకా చోటు చేసుకున్న పురోగతి సహా, మరిన్ని వివాదాస్పద అంశాలపైనా దర్యాప్తును వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలపై కేబినెట్‌ లో చర్చిస్తారని తెలుస్తోంది. అదేవిధంగా ఏపీ ఫైబర్ గ్రిడ్ లో నారా లోకేష్ పై వస్తున్న అవినీతి ఆరోపణలపై కూడా వేగవంతమైన విచారణకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే అమరావతి భూముల విషయంలో టీడీపీ నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించనున్నట్టు సమాచారం. అలాగే ఈ భేటీలో సంక్షేమ పథకాలు, కోవిడ్‌ నియంత్రణ చర్యలపై చర్చించనున్నట్టు సమాచారం.

 

ఇక గత నెల 11న జరిగిన‌ భేటీలో ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులకు, వైఎస్సార్‌ చేయూత, జగనన్న తోడు, గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. అలాగే వీటితో పాటు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను కేబినెట్ ఆమోదించింది. అదేవిధంగా రాజధాని విషయంలో కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఈ కేబినెట్ భేటీతో చంద్రబాబు, లోకేష్ లకి సీఎం జగన్ ముహూర్తం పెట్టబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: