మెథ‌డ్స్ అండ్ మోటివ్స్
ఒక్కొక్క‌రున్న దేశాన
అంద‌రొక్క‌టై ఉంటారా
భావి భార‌తం మార్చేద‌మంటూ
భ‌విత గీత‌నే రాస్తారా
అని ఓ పాట రాశాను
ఉండాల‌న్న‌దే ఆశ ఈ ప్రార్థ‌న

మార్నింగ్ రాగా : ఎ జ‌ర్నీ విత్...రామూ

ఫ‌స్ట్ కాజ్ : ఇద‌మ్ వాక్య‌మ్

సెకండ్ థాట్ : నిన్న‌టి వేళ సీమ సిటుక్కుమంటాంటే పుస్త‌కం డిజిట‌ల్ పోస్ట‌ర్స్ విడుద‌ల చేసిన ఎంపీ రామూకు ఓ కృత‌జ్ఞ‌త..
ఓ ధ‌న్య‌వాద

 

స్మ‌రామి సీమ : ఆ క్ర‌మంలోనే ఈ కొత్త పుస్త‌కం
వాన కారు కోయిలు తెలియ‌వు..రాలు పూల తేనియ‌లూ తెలియ‌వు..ఎండల‌ను నీడ‌లుగా అనువ‌దించిన చెట్టు త‌ల్లికి భ‌ర‌ద్వాజ ప్ర‌ణ‌మిల్లాడు నేనెందుకు ఆ ప‌ని చేయలేదో తెలియ‌నిత‌నం నాలో..గ‌తంలో..ఎన్ని సార్లు అనుకుంటానో ఆ ప‌చ్చ‌ని తోట‌లు, ఈ బి డ్డలు ఆనందాల‌కు ఆన‌వాళ్లే..బిడ్డ‌ల‌ను ప్రేమించ‌డం అనే చిన్న ప‌ని ద‌గ్గర ఈ దేశం చిన్న‌బోతోంది..అని! వాడు బిడ్డ‌ల‌ను ప్రేమించే తీరే ఈ పుస్త‌కానికి నాంది. నాది అని అన్నదేదీ ఉండ‌ద‌ని వ‌ద్ద‌ని అంటారే న‌వ్వుకుంటాను అన్నీ అబ‌ద్ధాలే, వాడు అనగా రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి. వాడు అన‌గా పుస్త‌కం వ‌స్తుందన్న ఆనందంలో ఉన్న‌వాడు..బిడ్డ‌ల‌కు ఏమ‌యినా కాదు క‌ల‌లు మాత్ర‌మే ఇవ్వండి ఏ మీ ఇవ్వొద్దు అని నేర్ప‌డం మొద‌లుపెట్టిన వాడు..లేదా ఆ ప్ర‌క్రియ‌కు స‌మీపంలో ఉన్న‌వాడు. అలాంటి వాడు అలాంటి రాత వెల్లి విరుస్తూ పోతుంటే.. ఒక్కటే అనుకున్నా..ఎలా అయినా ఇచ్చిన మాట నిల‌బెట్టుకుని తీరాల‌ని.. ఆ క్ర‌మంలోనే ఈ కొత్త పుస్త‌కం త్వ‌ర‌లో మీ ముందుకు..

 

ఇంత బాగా రాశారా..వెరీ గుడ్..వెరీ గుడ్
బండి వేగంగా పోతుంది. నాన్న‌ను స్మ‌రిస్తూ..ఒక బిడ్డ..త‌ల్లీ,తండ్రీ ఏం నేర్పారు ఇంత‌టి బాధ్య‌తతో ఉన్నారు అని అడగాలి. కానీ అ డ‌గ‌ను. తెలుసు..ఎర్ర‌న్నాయుడు స‌ర్ బిడ్డ‌లు..ఎలా ఉంటారో ఎలా న‌డుచుకుంటారో అన్న‌ది. అప్ప‌టిదాకా రామూ స‌ర్ కు నేనెవ్వ ‌రో తెలియ‌దు. 2017లో కొద్దిగా తెలుసునేమో.. బండి వేగంగా పోతుంది అని రాశానా..విశాఖ ఎయిర్ పోర్ట్ వ‌ర‌కూ వ‌స్తాను నాలు గంటే నాలుగు ప్ర‌శ్న‌లు అంటూ స‌ర్ తో ప్ర‌యాణి స్తూ పోతూ,పోతూ ఎన్నో విష‌యాలు వెల్ల‌డికి నోచుకునేలా చేశాను..అప్ప‌టికీ ఆ య‌న ఎంపీ. ఎవ్వ‌రో ఏదో ఒక బ‌ర్త్ డే స్పెషల్ కావాలి రాయగల‌రా అంటే వారం రోజులే క‌దా! ఉంది టైం అంటే..ఏం కాదు..నేను రా స్తాను. వేగంగా రాస్తాను..అనుకున్న స‌మ‌యం క‌న్నా అంద‌రి కన్నా ఈ బ‌చ్చా మీడియాల‌న్నింటికీ మిన్న‌గా రాయ‌గ‌ల‌ను అన్న ‌ది నా పొగ‌రు..ఆ పొగ‌రే నాలో నాటుకుపోయింది. అండ్ ద టైటిల్ ఈజ్ సిక్కోలు వాకిట రామ స‌క్క‌నోడు..ఇదంతా మూడేళ్ల కింద‌టి క‌థ‌. పుస్త‌కం చాలా పేరు తీసుకువ‌చ్చింది. కేవ‌లం రెండు గంట‌ల ప‌దినిమిషాల్లో నాతో మాట్లాడి ఇంత బాగా రాశారా..వెరీ గుడ్.. వెరీ గుడ్ అని ఎన్ని సార్లు అన్నారో ఆయ‌న‌.

 

ఒక ఉత్త‌రం.. ఒక జీవితం
దుఃఖం మాత్ర‌మే మ‌న‌ల్ని కాపాడేందుకు ప్ర‌య‌త్నించే తీవ్రం అయిన భావోద్వేగం అనుకుంటాను. ఇది ఇంటి చుట్టం అవునో కాదో తెలియ‌దు..ఈ సారి నేను..హోరున వాన ప‌డుతుంది.. పోతున్నాను.. రామూ స‌ర్ కు మీరు చెప్పండి చిన్న లెట‌ర్ కావాలి అని..
నాలో ఏమీ లేదు..చెప్తానంతే..నాతో ఓ ఈనాడు విలేక‌రి వ‌చ్చారు. పీఎం స‌హాయ నిధి నుంచి కాస్త సాయం కావాలంటూ..విన్న పం.. శ్రీ‌కాకుళం క‌లెక్ట‌రేట్ పోర్టికో ద‌గ్గ‌ర..నేనూ నాతో పాటూ నా మిత్రుడు. స‌ర్! ఆగండి వీరి ప‌నేంటో ఒక్క‌సారి చూడండి ప్లీజ్..హా ! ర‌త్నా తప్పకుండా అని చెబుతూ, కొండంత క‌ష్టంలో ఉన్న ఆ కుటుంబానికి వెనువెంట‌నే ఉప‌శ‌మ‌నంలాంటి మాట ఒక‌టి అందిం చారు..లెట‌ర్ ఇచ్చారు..ఆ బాధిత కుటుంబం ఎంత సంతోషించిందో..తీవ్ర‌మ‌యిన వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆ కుర్రాడికి కాస్త సాం త్వ‌న.

 

అలా తొలి అడుగు..
నాన్న ఎర్ర‌న్న లేరు..ఉంటే నాన్న ఇటుగా ర‌మ్మ‌ని అడ‌గ‌రు. కోరుకుని ఉండ‌రు. స‌ర్ ఇటుగా వ‌చ్చారు క‌దా! అప్ప‌టి డైల‌మా నుం చి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు..నాకేం తెలియ‌దు అండి..రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఏనాడూ అనుకోలేదు. నాన్న మ‌ర‌ణానంత‌రం మా కు టుంబం తీసుకున్న నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఇటుగా వ‌చ్చాను. నాన్నంత‌టి నాన్న అచ్చెన్న ఇంకా ఇంకొంద‌రు నాపై ఉంచి న‌మ్మ కం నిల‌బెట్టుకుని తీరాల‌న్న సంక‌ల్పంతో అడుగులు వేశాను. అలానిలుబెట్టుకోవాలి అంటే ఒ క్క‌టే సైకిల్ యాత్ర చేసి ప్ర‌తి ఒక్క‌రి నీ ప‌ల‌క‌రించి, అటుపై ఏద‌యినా ఓ భ‌రోసా ఇవ్వాలి అన్న‌దే..నా ప్ర‌ణాళిక‌. ఆలోచ‌న‌. ఆ త‌లంపు నుంచే నేను బయ‌లుదేరాను.. అప్ప‌టికీ నాకు హీరో తార‌క్ ఒక్క‌రే ఇన్స్‌ప్రేష‌న్.

 

మ‌ళ్లీ నాలో ఆనందాల‌ను నింపారు
ఈ సారి కెమెరా ఆన్ అయింది..ఓ జాన‌ప‌ద క‌ళాకారుడు మాట్లాడుతున్నారు. స‌ర్ మాకు పింఛ‌న్ అంద‌డం లేదు.. మా త‌ల్లిదం డ్రులు అనారోగ్యంతో ఉన్నారు..అంటూ చెబుతూ పోతున్నాడు.. లైవ్ లో స‌ర్ ఎదురుగా ఒక్క‌టే చెప్పాను.. రామూ స‌ర్ మిమ్మల్ని త‌ప్ప‌క ఆదుకుంటారు..నేను కూడా మీ వెంటే అని.. అన్న‌మాట ప్ర‌కారం మా శివ (పూర్తి పేరు శివ బురిడి)కు సాయం చేశారు. ఆ కార్య‌క్ర‌మం పేరు పొలిటిక‌ల్ సైన్స్ విత్ శంభుమ‌హంతి. ఇదే టైటిల్ పుస్త‌కం కూడా విడుద‌ల చేశాక, ఆయ‌న‌ను క‌లిశాను..ర‌త్నా! మీ సంక‌ల్పం నెర‌వేరిందా అన్నారు..హా స‌ర్..వెరీగుడ్.. ఐ యామ్ విత్ యూ.. అని చెబుతూ మ‌ళ్లీ నాలో ఆనందాల‌ను నింపారు.

 

నిర్బంధాల వేళ..బాధ్య‌త‌ను మ‌రువక
నాయ‌కులు బాధ్య‌త‌గా ఉండాలి..ఉంటేనే ఎంతో సంతోషిస్తాను. తెలంగాణ ఉద్య‌మం ఆ ప‌ని కాస్త చేయ‌గ‌లిగింది. రామూ స‌ర్ మి మ్మ‌ల్ని రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లూ ప్రేమిస్తున్నారు..మీరు ఇంకా బాగా ప‌నిచేయాలి అని ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతూనే ఉంటాను. ఈ లాక్డౌన్ టైంలో ఒక్క‌టే చెప్పాను ఆ రిమ్స్ ఆస్ప‌త్రి రోగుల‌కు మీరే అన్నం పెట్టాలి అని.. అడిగిందే త‌డ‌వుగా మ‌రో ఆలోచ‌న‌కు తా వివ్వ‌క రామ‌న్న అన్న‌దాన క్ర‌తువుకు శ్రీ‌కారం దిద్దారు. ఈ లాక్డౌన్ టైంలో విదేశాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని ఇక్క‌డికి తీ సుకువ‌చ్చేందుకు త‌న వంతు కృషిచేశారు. నా త‌మ్ముడు టెన్ టీవీ ఫేం వంశీ మాట‌ల్లో చెప్పాలంటే..అన్నా! హైద్రాబాద్‌లో చిక్కు కుపోయి ప‌నిలేక తిండి లేక అల్లాడిపోతున్న వారికి రామూ స‌ర్ ఒక్క మాట చెప్పి త‌న‌వారితో సాయం అందేలా చేశారు..మ‌రువ ‌ను అని..

 

మ‌రువ‌ను ఆ సంద‌ర్భాన్ని
ఇప్పుడు మ‌రో విష‌యం చెబుతాను..ర‌క్త‌దానం ఆవ‌శ్య‌క‌త గురించి స్పీచెస్ ఇవ్వ‌డం కాదు ఏద‌యినా చేయాలి అని అనుకుంటుం టాను.. స‌ర్ మొన్న‌టి లాక్డౌన్ టైంలో జిల్లాలో ర‌క్త నిల్వ‌లు లేవ‌న్న విష‌యాన్ని గుర్తించి వెనువెంట‌నే స్పందించారు. ర‌క్త‌దాన శిబి రం రెడ్ క్రాస్ జిల్లా కార్యాల‌యంలో నిరాటంకంగా నిర్వ‌హించి 222పైగా యూనిట్ల ర‌క్తాన్ని అందించారు. కేవలం ఆయ‌న ఇచ్చిన పి లుపు మేర‌కు ప‌ర్లాకిమిడి నుంచి కూడా కొంద‌రు అభిమానులు ఎన్నో అవ‌రోధాలు దాటుకుని వ‌చ్చి, ర‌క్త‌దానం చేశారు. నాయ కు లు ఇంత బాధ్య‌త‌గా ఉండాలి. ఉంటేనే మేలు..లేకుంటే ఒప్పుకోను. మ‌నం మాట్లాడ‌డం కాదు మ‌నం ఏదో ఒక‌టి ఇత‌రుల కోసం చే యాలి.. మ‌న కోసం ఇత‌రులు బాధ్య‌త‌గా ఉన్న వేళ‌నూ సంద‌ర్భాన్నీ ఎన్న‌డూ మ‌రిచిపోకూడ‌దు అని అంటాన్నేను..

 

ఆ మాట అంద‌రికీ అనువ‌ర్తితం..
ఈ సారి రాత్రి ప‌దిన్న‌ర గంట‌లు.. ఆదివారం అనుకుంటా..ఎవ్వ‌రో ట్విట‌ర్ ఎకౌంట్ ఒక‌టి ఫేక్ ది ఆయ‌న పేరుతో క్రియేట్ చేసి ఏవేవో రాసి విసిరేశారు. వెంట‌నే స‌ర్ తో డిస్క‌స్ చేసి రైట‌ప్ రాసి పంపాను. ఎంతో ఆనందించారు.. ఇంత‌వేగంగా నేను చెప్పిన మాట‌ల‌న్నీ ఎంతో బాగా రాశారే వెరీగుడ్ అంటూ పొంగిపోయారాయ‌న. కేవ‌లం అబ‌ద్ధాలు పోగేసే వార్త‌లు, క‌థ‌నాలు కాదు క‌దా జ‌ర్న‌లిజం అం టే..ఇవ‌న్నీ ఎందుకు మ‌నం ఎలా ఉన్నామో అలానే ఉందాం..అప్పుడు ప్రాంతాల‌క‌తీతంగా మ‌నుషులు ప్రేమిస్తారు..నా జీవితంలో జ‌రిగింది ఇదే! స‌ర్ లోగో రాయండి.. స‌ర్ మీరు సాయం చేయండి..అని ఎవ్వ‌రిని ప్రార్థించినా స్పందించే గుణ‌మే నా పాలిట శ్రీ‌రామ ర‌క్ష. రామూ స‌ర్ లోనూ ఇదే గ‌మ‌నించాను. స‌ర్ మీరు ఏద‌యినా చేయాలి వీరికి అండ‌గా ఉండాలి అని అడిగిన ప్ర‌తిసారీ అండ‌గా ఉన్నారు. నాయుడు గారి అబ్బాయి ఏం చ‌దువుకున్నారు? ఎంత బాగా మాట్లాడ‌తారో! అని నాతో అంతా అంటారు. 

 

తెలంగాణ నే ల నుంచి ఇ లాంటి ప్ర‌శంస విని పొంగిపోతాను..ఎందుకంటే ఆ నేల నుంచి వ‌చ్చే ప్ర‌తి మాట‌నూ నేను వింటూ ఆస్వాదిస్తాను. స‌ర్ .. నా సంస్థ ఫ్రెం డ్స్ ఫ‌ర్ సొసైటీ త‌ర‌ఫున ఓ తెలంగాణ ర‌చ‌యిత క‌ష్టంలో ఉన్నార‌ని తెలిసి తోచినంత‌లో ఆదుకుంది అని చెప్పగానే ఎంతో ఆనందిం చారు.. ఇది క‌దా కావాలి. స‌ర్ ఈ పుస్త‌కం వ‌స్తుంది సీమ సిటుక్కుమంటాంటే మీరు పోస్ట‌ర్స్ లాంఛ్ చేయండి.. వా రికి శుభాకాంక్షలు అందించండి అని చెప్ప‌గానే అలానే ర‌త్నా త‌ప్ప‌కుండా అంటూ స్పందించారు. రాజా స‌ర్ కు ఒక్క‌టే చెప్పాను.. మీ నుంచి మరో కొత్త రైట‌ర్ ను ప్రోత్స‌హించే సంద‌ర్భాన్ని ఒక‌టి కోరుకుంటున్నాను అని..ఏమీ వొద్దు.. ఉన్న వాటికి భిన్నంగా మీ రు ప‌నిచేయాలి ..అని చెబుతుంటాను..ఇదే మాట రామూ స‌ర్ కూ, ఇదే మాట రాజా స‌ర్ కు, ఇదే మాట నా వ‌ర‌కూ వ‌ర్తితం. జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిదండ్రులకూ, ఈ నేల‌కూ వంద‌నాలు చెల్లిస్తూ.. రామూ స‌ర్ కు ఓ కృత‌జ్ఞ‌త ఓ ధ‌న్య‌వాదా మా రాజా త‌ర‌ఫున

 

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి: