నమ్మడానికి నిజం కాకపోయినా ఇది నిజంగా నమ్మవలసిన విషయం అమెరికన్ నావికాదళం లోని e-6b-mercury అనే ఒక విమానాన్ని ఒక పక్షి ఢీ కొట్టడం వల్ల దానికి 14 కోట్లు రిపేర్ చేయించాల్సిన అవసరం వచ్చింది. ఈ e-6b-mercury ఇది ఒక కమ్యూనికేషన్ మరియు కమాండ్ డిజైన్ చేసిన విమానం .ఇది  న్యూక్లియర్ వార్ లో చాలా విశిష్టమైన ప్రాముఖ్యం కలిగిన విమానం .

ఈ విమానం ఖరీదు దాదాపు వెయ్యి కోట్లు ఆకాశంలో కొన్నిపరీక్షలు  చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక పక్షి వచ్చి విమానంలో ఉన్న నాలుగు ఇంజన్లు ఒక ఇంజన్లు లోకి దూరింది.ఇది జరిగినప్పుడు ఆ విమానంలో దాదాపు నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది కానీ ఎవరికీ ఏ హాని జరగలేదు అని  తెలియజేశారు. దీని పైన ఒక నిపుణుల కమిటీ దర్యాప్తు మొదలు పెట్టింది. దాదాపు వారం రోజులు శ్రమించిన తర్వాత ఆ ఇంజన్ మళ్లీ రిపేర్  చేసిన తర్వాత ఆ విమానం గాల్లోకి ఎగిరింది.

ఈ విమానం 150 అడుగుల పొడుగు ఉంటుంది ,ఇది గంటకు దాదాపు 1000  కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.ఈ రకం విమానాల 1997లో ఆమోదించారు. ఇప్పుడున్న విమానాలు లా కాకుండా ఇంతకుముందు ఇలాంటి వాటికి పక్షుల నుంచి కాపాడుకునే శక్తి విమానాలకు లేవు. 1981 నుండి 2011 వరకు దాదాపు 16 వేల ఐదు వందల పక్షులు విమానాల గుద్దుకోవడం వల్ల 2500 కోట్లు నష్టం కలిగిందని సముద్ర రక్షణ అధికారి చెప్పారు.

2009లో కూడా ఒక విమానము ఇలాగే రెండు ఇంజన్లు కూడా పక్షులు దూరం వల్ల చెడిపోయాయి ఆ రోజు 155 మంది ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నారు కానీ పైలట్ చాకచక్యంతో హడ్సన్  నది దగ్గర ల్యాండ్ చేసి అందని సురక్షితంగా బయటికి తీసుకుని వచ్చారు .


మరింత సమాచారం తెలుసుకోండి: