APGS సర్టిఫికెట్  వెరిఫికేషన్ 2019  ఎంపికైన అభ్యర్థులకు కాల్‌లెటర్లు విడుదల చేననున్నారు. అభ్యర్థులు వారి కాల్‌లెటర్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిగా  తెలిపారు . నిర్ణీత తేదీల్లో, నిర్ణీత కేంద్రంలో సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరుకావాల్సిన అవసరం ఉంటుంది.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించడం జరుగుతుంది.

సెప్టెబరు 24 నుంచి 25 లేదా 26 వరకు సర్టిఫికేట్లను పరిశీలించనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో రిజర్వేషన్లు, రోస్టర్ ప్రకారం జిల్లాల వారీగా మెరిట్ జాబితాను అధికారులు రూపొందించారు. ఈ జాబితా ప్రకారం సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నారు. ఎంపికైన వారికి 27వ తేదీ నుంచి నియామక ఉత్తర్వులను జారీ చేస్తారు. అభ్యర్థిలకు  ఏ రోజు, ఏ ప్రాంతంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారో అన్న అంశాలన్నీ అభ్యర్థికి SMS ద్వారా సమాచారం అందిస్తాము అని  అధికారులు తెలిపారు.

అభ్యర్థులు ఒకవేళ కాల్‌ లెటర్‌లో పేర్కొన్న తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోయినా లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరైనా.. అన్ని ఒరిజనల్స్‌ చూపలేకపోయినా.. వారికి మరో ఛాన్స్‌ ఉంటుంది అని తెలిపారు. ఎంపికైన వారికీ సెప్టెంబరు 29లోగా నియామక పత్రాలు అందజేయనున్నారు. వీరికి మొదటి విడతలో రెండు రోజులు ప్రాథమిక శిక్షణ ఇస్తారు. వీరంతా అక్టోబర్‌ 2న విధుల్లో చేరాల్సి ఉంటుంది.

అనంతరం వీరికి అక్టోబరు 14 నుంచి రెండో విడత శిక్షణ ఇవ్వనున్నారు. నవంబరు 15 వరకు దశల వారీగా శిక్షణ ఇస్తారు. సెప్టెంబరు 26 నుంచి శిక్షకులకు శిక్షణ ఇవ్వనున్నారు.సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్..అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే సంబంధిత హెల్ప్‌లైన్లకు ఫోన్ చేయవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈమెయిల ద్వారా కూడా అభ్యర్థులులు తమ సందేహాలను పంపవచ్చు.హెల్ప్‌లైన్ నెంబర్లు.. 91212 96051 , 52 , 53 , 54 , 55 . ఈమెయిల్: vswsexams@gmail.com


మరింత సమాచారం తెలుసుకోండి: