రోడ్డుపై ఎక్కడైనా ప్రమాదం జరిగితే ముందుగా గుర్తొచ్చే పదం 108 వాహనం. ఎవరైనా ప్రమాదంలో గాయపడితే అర్జంటుగా 108 నెంబర్ కు ఫోన్ చేస్తారు. ఆ సిబ్బంది క్షణాల్లో ప్రమాద స్థలానికి చేరుకుని సేవలు అందిస్తారు. ప్రాణాలు కాపాడతారు.


అలా జనం ప్రాణాలు కాపాడే 108, 104 ఉద్యోగులపై జగన్ వరాలు కురిపించారు. తనను కలిసిన 108, 104 ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. 108, 104 ఉద్యోగులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.


108, 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం హామీ ఇవ్వడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై  108 టెక్నీషియన్‌కు రూ.30వేలు, పైలెట్‌కు రూ.28 వేలు జీతం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. 104 ఉద్యోగులకు రూ.28 వేలు, డ్రైవర్‌కు రూ.26 వేలు జీతం ఇస్తామని భరోసా ఇచ్చారు.


104 వైద్యులకు సర్వీస్‌ మెయిటేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జగన్ హామీతో వారంతా ఖుషీ అయ్యారు. తమ జీతాలు పెరగబోతున్నాయని సంతోషంగా వెనుదిరిగారు.


మరింత సమాచారం తెలుసుకోండి: