‘నిర్మాణ్’ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి తో కూడిన శిక్షణ!
మరిన్ని

‘నిర్మాణ్’ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి తో కూడిన శిక్షణ!

హైదరాబాద్ నగరంలో నిరుద్యోగులు డిగ్రీ పట్టా పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా సరైన ఉద్యోగం దొరకడంలేదు. జాబ్ చేయడానికి అవసరమైన నైపుణ్యాలు లేకపోవడమే అందుకు ముఖ్య కారణం. అనేక ఇంటర్వ్యూలకు వెళ్లిన తరువాత గాని వారికి ఈ సంగతి అర్థం కావడంలేదు. ఎక్కువ మార్కులు సంపాదించి ఇంటర్ లేదా డిగ్రీ, బీటెక్, పాస్ కావడమే లక్షంగా చదివిన విద్యార్థులు. ఉద్యోగం కోసం నైపుణ్యాలు నేర్చుకోవాలనే విషయాన్ని గుర్తించడం లేదు. మరి అలాంటి నైపుణ్యాలు ఎక్కడ నేర్పుతారు అనే సందేహాలకు సమాధానమే"నిర్మాణ్" వారి స్మార్ట్ ఉచిత శిక్షణ కేంద్రం. 

నిర్మాణ్ ద్వారా శిక్షణ పొంది ఉద్యోగం చేస్తున్నా స్టూడెంట్స్....  
1)  ఈ.సంధ్య:
మేము మోగుడం పల్లి గ్రామం సంగారెడ్డి జిల్లాలో లో మా అమ్మానాన్నలు వ్యవసాయ కూలీలుగా పని చేస్తారు చదువుకోవడానికి కూడా డబ్బులు లేని పేదరికంలో కూడా మా తల్లిదండ్రులు నన్ను కష్టపడి చదివించారు. నేను 2019లో బి టెక్ చదువు పూర్తి చేసి చాలా కంపెనీస్ లో ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యాను కానీ టెక్నికల్ గా మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల నేను సెలక్ట్ అవ్వలేక పోయాను అదే సమయంలో నిర్మాణ సంస్థ నైపుణ్య శిక్షణ ఇస్తున్నారని తెలిసి వెబ్ & మొబైల్ అప్లికేషన్ డిజైనింగ్ ట్రైనింగ్ లో పరిజ్ఞానం పొందాను.   నా ప్రతిభను గుర్తించిన నిర్మాణ్ సంస్థ ఈటీవీ భారత్, రామోజీ గ్రూప్ లో సాఫ్ట్వేర్ డెవలపర్ గా పనిచేస్తూ (నెలకు 14,500) హ్యాపీ గా జీవిస్తున్నాను. ఆదాయంలో కొత్త మొత్తాన్ని నా తల్లిదండ్రులకు పంపిస్తూ మా కుటుంబ బాధ్యతలు పాలు పంచుకుంటున్నాను.