తాజాగా సీబీఎస్‌ఈ పదోతరగతి, ఇంటర్ (10, 12 తరగతుల) పరీక్షల షెడ్యూలును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేయడం జరిగింది. వెబ్‌సైట్‌లో పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూలును అందుబాటులోకి తీసుకోని రావడం జరిగింది. ఇక విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం ఒకేషనల్ సబ్జెక్టుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మొదలు అవ్వబోతున్నాయి. ఇక 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 20 వరకు నిర్వహిస్తారు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 30 వరకు  నిర్వహించాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 

ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసిన షెడ్యూలు వివరాల ఇలా ఫిబ్రవరి 15 నుంచి పదోతరగతి, 12వ తరగతి ఒకేషనల్ పరీక్షలు మొదలు అవ్వబోతున్నాయి.. ఫిబ్రవరి 26 నుంచి పదోతరగతి ప్రధాన పరీక్షలు, ఫిబ్రవరి 22 నుంచి 12వ తరగతి ప్రధాన పరీక్షలు నిర్వహించాలి అని బోర్డ్  నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 


ఇక మే మొదటి వారంలో సీబీఎస్‌ఈ బోర్డు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిన విదంగానే పరీక్షల ఫలితాలను వెల్లడిస్తాము అని తెలిపారు . ఇక విద్యార్థులు  పరీక్షలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ ను సంప్రదించవచ్చు. ఇక  విద్యార్థుల రూల్ నెంబర్లు,  హాల్‌టికెట్లను సంబంధిత మీ పాఠశాలలకు బోర్డు పంపించబడుతుంది అని బోర్డు తెలిపింది.  ఇక  విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ కూడా చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది.

 


 ఈ సంవత్సరం సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే విద్యార్థుల కొరకు 32 లక్షల డిజిటల్ లాకర్లను అందుబాటులోకి తీసుకొని రావడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యార్థులు  ఫలితాలు వచ్చిన తర్వాత  తమ మార్కు షీట్లను, మైగ్రేషన్ సర్టిఫికేట్లు, పాస్ సర్టిఫికేట్లను డిజిటల్ లాకర్ల ద్వారా డౌన్‌లోడ్ సులభంగా చేసుకోవచ్చు అని బోర్డు తెలిపింది. ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు రెండు మ్యాథమెటిక్స్ పరీక్షలు పెట్టబోతున్నారు. స్టాండర్డ్ మ్యాథ్స్ ఎగ్జామ్, బేసిక్ మ్యాథ్స్ పరీక్షలుగా విభజన చేయడం జరిగింది. ఇక విద్యార్థులకు  వారికీ నచ్చిన పరీక్ష రాసేందుకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: