యూపీఎస్సీ.. దేశంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే సంస్థ. కేంద్ర ప్రభుత్వంలోని

వివిధ విభాగాలకు, డిపార్టుమెంట్లకు ఉద్యోగులను నియమించే సంస్థ. అలాంటి ఉద్యోగాలు ఇచ్చే సంస్థలనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది.

 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంతకీ ఖాలీలు ఏంటంటే.. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, డిప్యూటీ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్

 

ఈ రెండు విభాగాల్లో కలిపి 29 పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాలకు పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్), మాస్టర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి.

షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

 

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ జనవరి 16, 2020. మరిన్ని వివరాల కోసం https://www.upsc.gov.in/ చూడొచ్చు. పోస్టులు తక్కువగా ఉన్నాయని సందేహించవద్దు. ఇలాంటి తక్కువ పోస్టులు ఉన్న నోటిఫికేషన్లకు దరఖాస్తులు కూడా తక్కువగానే వస్తాయన్న లాజిక్ మరిచిపోవద్దు. ఆల్ ది బెస్ట్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: