ఇస్రో.. భారత దేశంలో ప్రతిష్టాత్మకమైన సంస్థ. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న సంస్థ. ఇలాంటి కీలక సంస్థలో సైంటిస్టు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఇస్రోకు దేశవ్యాప్తంగా చాలా కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో కీలకమైంది నెల్లూరు జిల్లా శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్) లోని ఇండియన్ స్పేస్ రిసె ర్చ్ఆర్గనైజేషన్ (ఇస్రో)-సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్). ఇప్పుడు ఇందులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది.

 

ఏం పోస్టులు అంటారా.. సైంటిస్టు / ఇంజినీర్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం ఖాళీలు: 21 పోస్టులు ఉన్నాయి. సైంటిస్టు/ఇంజినీర్ పోస్టులు 19 ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు 02 ఉన్నాయి.

 

కెమికల్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, పవర్ సిస్టమ్స్ తదితరాల విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. సైంటిస్టు, ఇంజినీర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్,
ఎంఈ/ఎంటెక్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.

 

అలాగే మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్ ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేశారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించేందుకు జనవరి 17, 2020 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్: https://www.shar.gov.in/ ను సందర్శించ వచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: