అమ్మ ఒడి.. ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఇది. పిల్లలను బడికి పంపిన ప్రతి పేద తల్లికీ ఏడాదికి 15 వేల రూపాయలు అందించనున్నారు. ఈ పథకం జగన్ మార్కు పథకాల్లో చాలా ప్రసిద్ధి పొందింది. ఈ పథకం చూసైనా సరే ఇక తమ పిల్లలను పనికిపంపబోమని.. చదవిస్తామని పేద తల్లిదండ్రులు అనుకుంటున్నారు.

 

అయితే.. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ.. జనవరి 5 వ తేదీ సాయంత్రం 5 గంటలు. ఇప్పటికే ఈ పథకం కింద దాదాపు 42 లక్షల మందిని గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే అర్హులతో ఓ జాబితా ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో పేర్లు లేని వారికి ఇప్పుడు ఈ ఆఖరి అవకాశం కల్పిస్తోంది.

 

జనవరి 5 వ తారీఖు వరకూ దరఖాస్తు చేసుకున్నవారి వివరాలు పరిశీలించి వారిని కూడా లబ్దిదారులుగా గుర్తిస్తారు. ఈనెల 29న చిత్తూరు లో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. పదో తారీఖుల్లా అమ్మల ఖాతాల్లో డబ్బు వేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: