18 నుంచి 35 వయసు మధ్య ఉన్న గిరిజన యువకులకు ఇదే మంచి అవకాశం. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో గోల్ పేరిట శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ గోల్ లో గిరిజన యువత కోసం కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఫేస్బుక్ ఇండియా ఆధ్వర్యం లో ఒక డిజిటల్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు ప్రకటన ద్వారా తెలిపింది. తెలంగాణ గిరిజన గురుకుల విద్యాసంస్థల సొసైటీ చేసిన ప్రకటన ద్వారా క్లారిటీ వచ్చింది. ఈ గోల్ అంటే  గోయింగ్ ఆన్ లైన్ యాజ్ లీడర్స్.

 

అయితే ఈ  పేరిట నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమానికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఏళ్ల మధ్య లో ఉన్న  యువత హాజరు కావచ్చని చెప్పింది. అయితే ఇందులో విద్య, ఆరోగ్యం, వ్యాపారం, రాజకీయం, కళ, పరిశోధన, ఎంట్రప్రెన్యూర్షిప్ విభాగాల్లో తొమ్మిది నెలల పాటు శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. ఈ తొమ్మిది నెలల శిక్షణానంతరం వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ని కూడా జారీ చేస్తున్నట్లు చెప్పారు.

 

అయితే మంచి ప్రతిభ కనపరిచిన  వారికి మరో బహుమానం. అది ఏమిటి అంటే ప్రఖ్యాత సంస్థ లో ఇంటర్న్షిప్ ని కూడా చెయ్యడానికి  అవకాశం లభిస్తుందని చెప్పారు. అయితే వారి అఫీషియల్  వెబ్ సైట్  ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కూడా చెప్పారు. ఆ వెబ్సైట్ ఆధారంగా  రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ గోల్ లో భాగం కావచ్చు .

 

కనుక యువత ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుని ఈ మంచి కార్యక్రమం లో భాగం అవ్వచ్చు . చూసారా ఎంత మంచి అవకాశామో. మరి ఆలస్యం  చెయ్యకండి దీనిలో భాగం మీరు కూడా అవ్వండి. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకుని మీకు నచ్చిన విభాగం లో సర్టిఫికెట్ తో పాటు ఇంటర్న్షిప్ అవకాశాన్ని కూడా దక్కించుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: