భారత దేశ అటవీ సంపద, అడవులు , వృక్ష ,జంతు జాతుల మనుగడ వివిధ అంశాలపై పరిశోధనలు చేసే విద్యార్ధులకి డెహ్రాడూన్ లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తమ పరిశోధనలు నిర్వహించుకోవడానికి మంచి  అవకాశాన్ని ఇస్తోంది.  దేశవ్యాప్తంగా ఉన్న అటవీ పరిశోధనా కేంద్రాల్లో పీహెచ్‌డీ డిగ్రీ ఇన్ ఫారెస్ట్రీ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

 Adminissions

విభాగాలు: సిల్వికల్చర్, ఫారెస్ట్ జెనెటిక్స్, ఫారెస్ట్ బోటనీ, ఫారెస్ట్ మేనేజ్‌మెంట్, వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ ఎంటమాలజీ, ఫారెస్ట్ బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, సాయిల్ సైన్స్ తదితరాలు..

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.

ఎంపిక: ఎఫ్‌ఆర్‌ఐ ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. యూజీసీ నెట్/యూజీసీ-సీఎస్‌ఐఆర్ నెట్ (జేఆర్‌ఎఫ్‌తో సహా) తదితరాల్లో అర్హత ఉన్నవారికి రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎఫ్‌ఆర్‌ఐ పరీక్ష తేదీ: జులై 14, 2019.

పరీక్ష విధానం: ఇందులో సెక్షన్-ఏ, సెక్షన్-బీ ఉంటాయి. 

సెక్షన్-ఏ:

బేసిక్ సెన్సైస్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ)- 30 ప్రశ్నలు (12వ తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి).

మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, రీజనింగ్)-20 ప్రశ్నలు (10వ తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి).

జనరల్ ఇంగ్లిష్- 25 ప్రశ్నలు (12వ తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి).

జనరల్ అవేర్‌నెస్- 25 ప్రశ్నలు.

సెక్షన్-బి:

జనరల్ ఫారెస్ట్రీ-40 ప్రశ్నలు.

సబ్జెక్ట్/సంబంధిత విభాగం-60 ప్రశ్నలు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.1500 (డీడీ ద్వారా చెల్లించాలి).

దరఖాస్తుకు చివరితేదీ: మే 31, 2019.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్http://fridu.edu.in


మరింత సమాచారం తెలుసుకోండి: