అవసరం పెరుగుతున్న కొద్దీ నగరాల్లో, పట్టణాల్లో కొత్తగా చాలా జిమ్ములు ప్రారంభమవుతున్నాయి. జిమ్, హెల్త్ క్లబ్, ఫిట్ నెస్ సెంటర్... పేరేదైనా సరే ఏ ఒకటిలే అని చేరిపోకుండా నిర్వహకుల అర్హతలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. సిబ్బందికి సరైన విద్యార్హతలున్నాయా? గుర్తింపు పొందిన సంస్థ మంచి సర్టిఫికెట్ ఉండాలి. పనిచేసిన అనుభవమూ ఉండాలి. అపుడే దైర్యంగా మన శరీరాన్ని వాళ్ల చేతుల్లో పెట్టవచ్చు. ఫిట్ నెస్ సెంటర్ ఆవరణ శుభ్రంగా ఉందో లేదో చూడాలి. పరికరాలన్నీ సరిగా ఉన్నాయా? అవి పనిచేస్తున్నాయా?. వాటిని సరిగా నిర్వహిస్తున్నారా... అన్న గమనించాలి. గదుల్లోకి గాలివెలుతురు సరిగా వస్తున్నాయో లేదో చూడాలి. మరీ చల్లగా లేకుండా చూసుకోవాలి. ఉష్ణోగ్రత సరిపోయినంత ఉండేలా నియత్రించే సౌకర్యం ఉండాలి. చల్లటి వాతావరణం ఉంటే కీళ్ల నొప్పులు పెడుతాయి. మీ పనితీరును వారు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు మరింత మెరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారా? అత్యవసర వైద్య సహాయం అవసరమైతే అందించే వీలు అక్కడ ఉందా.... ఆ విషయం ముందుగానే కనుక్కోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: