రోజూ మీ పరిగడుపున ఒక లీటరు నీటిని త్రాగి, భోజనంలో పీచ పధార్థాలు, ఎక్కవగా తీసుకోవటం అలవాటు చేసుకుంటే మోషన్ సిక్నెస్ తగ్గుతుంది. నిమ్మకాయ ఊరగాయ రోజుకు ఒక ముక్క తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గావుటుంది. వేసివిలో రాత్రివేళ మేకప్లో జింక్ ఉన్న క్రీములు వాడాలి. ఇవి ముఖాన్ని కాంతివంతం చేయటమే కాక చల్లధనాన్ని కూడా ఇస్తాయి. సన్ స్ర్కీన్ లోషన్ కొనేటప్పడు ప్యాక్ మీద ఎస్.పి.ఎఫ్ (సన్ ఫ్రొటెక్షన్ ఫ్యాక్టర్) 15 శాతం ఉండేలా జాగ్రత్త పడాలి. కూరగాయముక్కల్ని స్టీల్ చాకుని ఉపయోగించి తరగండి ఇనప చాకుతో కట్ చేస్తే దానికి ఉన్న తుప్పు కూరగాయలకు తగిలి ఆరోగ్యానికి హాని చేస్తుంది, నూనె వేడి చేసినప్పడు ఒక్కోసారి పొంగు వస్తుంది. కొంచెం కళ్ళే ఉప్పు లేదా చింతపండు రెబ్బను నూనెలో వేయండి నూనె పోంగు వెనక్కి తగ్గుతుంది. రసం పిండిన నిమ్మ చెక్కులను ఫ్రెషర్ కుక్కర్లో వేస్తే కుక్కర్ నలుపు పోతుంది. వీడియో గేమ్ లో వాడి పవర్ అయిపోయిన బ్యాటరీలు రిమోట్ లో వేస్తే కొద్ది రోజులు పని చేస్తాయి. ఎర్రచందనం పొడిలో కొబ్బరి పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది.  అరచేతులు గట్టిపడితే ఒక టీ స్పూన్లు చక్కెర అదే మోతాదులో ఆయిల్ కలిపి రెండు చేతులు మర్థనా చేసినట్లు రుద్దాలి. పచ్చిపసుపు, పాలమీగడ కలిపి ముఖానికి రాసి 20 నిమిషాలు తరువాత స్నానం చేస్తే చర్మం నిగనిగలాడుతుంది. ¼ టీస్పూన్ ఏలకులపొడిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తింటే వాంతులు, వికారం తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: