మీరు అధిక బ‌రువును త‌గ్గించు కోవాలని కుంటున్నారా? బ‌రువును స‌రిగ్గా మెయింటెయిన్ చేయలేక పోతున్నారా? నిత్యం శ్ర‌మించినా ఫ‌లితం రావడం  లేదా ? అయితే అందుకు చాలా  కార‌ణాలు ఉంటాయి.  అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డనికి కింది సూచనలు పాటిస్తే పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా మరి..! 

 

చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ను త‌ప్పిస్తే అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని భ్ర‌మ‌ప‌డుతుంటారు. కానీ ఇది నిజం కాదు. ఉద‌యం కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి, లేదంటే రోజులో త‌రువాతి స‌మ‌యాల్లో అధికంగా ఆహారం తీసుకుంటార‌ని, దాంతో అధిక బ‌రువు పెరుగుతార‌ని నిపుణులు తెలియ చేస్తున్నారు. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు క‌చ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. 

 

ఇక పాలకూర, తోటకూర.. తదితర ఆకుకూరల్లాగే మెంతికూరను కూడా చాలా మంది కూరగా చేసుకుని తీసుకుంటుంటారు. మెంతి ఆకులను పలు కూరల్లో కూడా వేసుకుంటుంటారు. అయితే ఇతర ఆకుకూరల్లాగే మెంతికూర ఆకుల్లోనూ అనేక ఔషధ గుణాలు బాగా లభిస్తాయి. ఈ ఆకులను తినడం వల్ల అనేక లాభాలు కలిగి ఉన్నాయి.. ముఖ్యంగా మెంతి ఆకులను చలికాలంలో తప్పనిసరిగా తినాలి. దాంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దామా మరి..

 

* చలికాలంలో చెమట పట్టేలా వ్యాయామం చేయాలంటే అందుకు చాలా సమయం పడుతుంది. అయితే మెంతి ఆకులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వ్యాయామం త్వరగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అలాగే చలికాలంలో బరువు తగ్గాలనుకునే వారు త్వరగా బరువు తగ్గించుకునేందుకు అవకాశం ఉంది. మెంతి ఆకులను నిత్యం తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. అలాగే శీతాకాలంలో సహజంగానే ఎదురయ్యే చర్మ సమస్యల నుంచి  కూడా బయట పడవచ్చు. ఇంకా చర్మం మృదువుగా, కాంతివంతంగా కూడా మారడం జరుగుతుంది.

 

* ఇక డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో షుగర్‌ను అదుపులో ఉంచుకోవడం సాధారణంగానే కాస్త కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మెంతి ఆకులను తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను అదుపు చేసుకోవచ్చు . చలికాలంలో జీర్ణ సమస్యలు కూడా సాధారణంగానే  వస్తుంటాయి. అలాంటి సమస్యలు ఉన్నవారు మెంతి ఆకులను నిత్యం తీసుకుంటే జీర్ణ సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: