మాటే ఓ మంత్రం అంటారు. అందరికీ ఇది వర్తించే సూత్రమే అయినా.. కొందరికి దీని అవసరం చాలా ఎక్కువ. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, టీవీ యాంకర్లు, వ్యక్తిత్వ వికాస నిపుణులు వంటి వారికి స్వరం చాలా అవసరం. అయితే చాలాసార్లు వీరికి గొంతు కీచుగా మారడం, స్వరం మారడం, గరకుగా మారడం వంటి ఇబ్బందులు వస్తుంటాయి.

 

ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య చాలా ఎక్కువ. తరచూ గొంతు మారుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఎలా కాపాడుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఓసారి చూద్దాం. సాధారణంగా స్వరం ఎక్కువగా వాడే వారికి తరచు గొంతు సవరించుకోవాల్సిన అవసరం వస్తుంది. అలా పదే పదే గొంత సవరిస్తే.. స్వరం మరింతగా పాడవుతుంది. అందుకే గొంతు సవరించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు..  నోరు తెరిచి హ.. అని గాలి వదిలితే సరిపోతుంది.

 

ఇంకా గొంతు పాడవకుండా ఉండాలంటే.. తరచూ నీరు తీసుకోవాలి. ప్రతి పది నిమిషాలకోసారి గోరు వెచ్చని నీరు తీసుకోవడం.. మంచిది.. సిప్ బై సిప్ తీసుకుంటే ఇంకా మంచిది. మరికొందరు గొంతు పూడుకుపోతుంది అని ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి వారు రాత్రి వేళల్లో స్పైసీ ఆహారం అస్సలు తినకూడదు. పులుపు పదార్దాలు కూడా తినకూడదు.  సిట్రస్ కంటెంట్ ఫుడ్ ను రాత్రి వేళల్లో దూరంగా ఉంచాలి.

 

అలాగే రాత్రి సమయాల్లో మజ్జిగ, పెరుగు తినకూడదు. అలాగే ఉదయం లేవగానే.. కాస్త గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని.. గొంతును గార్గిలింగ్ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గొంతును కాపాడుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: