మీ పిల్లలు నత్తితో బాధపడుతున్నారా.. లేక..పిల్లలకు నత్తి ఉందని మీరు భావిస్తున్నారా.. అయితే ముందు నత్తికి సంబంధించిన ప్రాథమిక విషయాలు తెలుసుకోండి. ఏది నత్తి.. ఏది కాదు.. అనే విషయంలో తల్లిదండ్రులకు స్పష్టత అవసరం. సులభంగా నత్తి అని వ్యవహరించినా..  నత్తిలో చాలా రకాలు ఉంటాయి. కొందరు పిల్లలు ఒకే పదాన్ని పదే పదే పలకడం, లేదా ఒక పదంలోని కొన్ని అక్షరాలను మాత్రమే మళ్లీ మళ్లీ పలకడం చేస్తుంటారు.

 

ఉదాహరణకు పలక అనేందుకు ప..ప..ప.. పలక అంటుంటారు. ఒక్కోసారి ఒక పదాన్ని పలకడానికి ముందు.. చాలా కష్టపడతారు. చాలాసార్లు అక్షరాలు నోట్లోనే ఉండిపోతాయి. బయటకు రావు. ఒక్కోసారి పదం లోని సగం అక్షరాలను పదే పదే పలుకుతారు. ఉదాహరణకు అప్పుడప్పుడు అని పలికేందుకు వారు.. అప్పు.. అప్పు.. అప్పు.. అప్పుడప్పుడు.. అంటుంటారు. ఇలా పదాలు పలకడంలోనే కాదు.. నత్తిలో మరికొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. వాటిని సెంకడరీ బిహేవియర్స్ అంటారు. అవేంటంటే.. మాట్లాడేటప్పుడు ఆ పదాలు సరిగ్గా రాకపోతే.. తలను కొట్టుకోవడం, భుజాన్నికొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. పదాలను పలికే ప్రయత్నంలో వారు ఇలా ప్రవర్తిస్తుంటారు.

 

పైన చెప్పిన లక్షణాలు పిల్లల్లో ఉంటే దాన్ని నత్తి లేదా స్టామరింగ్ అంటారు. అయితే పిల్లల్లో ఇలాంటి లక్షణాలు గమనించినప్పుడు.. వారికి స్పీచ్ థెరపీ ఇప్పించాలి. అలా కాకుండా.. ఆ.. ఏముందిలే.. వయస్సు పెరుగుతుంటే వాడే నేర్చుకుంటాడులే అని నిర్లక్ష్యం వహించకూడదు. అలా చేయడం చాలా తప్పు. అందువల్ల పిల్లవాడు భవిష్యత్తులో చాలా  ఇబ్బందులుపడే ప్రమాదం ఉంది.

 

 

వీరికి చిన్న వయస్సులోనే స్పీచ్ థెరపీ ఇప్పించకపోతే.. పై క్లాసులకు వెళ్తున్న కొద్దీ తోటి పిల్లలు అతన్ని హేళనే చేయడం ప్రారంభిస్తారు. దీనివల్ల పిల్లల్లో ఆత్మన్యూనత భావం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఉపాధ్యాయులతో సరిగ్గా మాట్లాడలేకపోతారు.. అపోజిట్ సెక్స్ పిల్లతో మాట్లాడేందుకు వెనుకాడుతారు. ఇలా క్రమంగా వారు అంతర్ముఖులుగా మారతారు. కొత్తవారితో మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడతారు. వీరికి చిన్న వయస్సులోనే  స్పీచ్ థెరపీ ఇవ్వడం ద్వారా  నత్తి సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. గుర్తుంచుకోండి. నత్తి అనేది సరిదిద్దలేని లోపం ఏమాత్రం కాదు.

 

పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్.. ప్రపంచ వ్యాప్తంగా.. స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యేలా దశాబ్దాల రీసెర్చ్ తో కూడిన అత్యంత ప్రభావంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సెలింగ్, ఛైల్డ్ డెవలప్ మెంట్, మరియు రీహేబిలిటేషన్ సర్వీసు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు, హెల్త్ కేర్ సంస్థ.

 

పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా.. మిరాకిల్ అనే పెటేంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. వంద మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతోమీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం పాటుబడుతున్న సంస్థ పినాలిక్ బ్లూమ్స్ నెట్ వర్క్. భారత ప్రభుత్వ  ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ వివరాల కోసం 9100181181 నెంబర్ లో నేడే సంప్రదించండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: