కొన్ని నెలల క్రితం పరిశోధకులు చేసిన కొన్ని పరిశోధనల్లో మధుమేహం వ్యాధి పొడవుగా ఉండే వారితో పోలిస్తే పొట్టిగా ఉండే వారిలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నట్టు తేలింది. పరిశోధకులు ఎత్తు తగ్గే కొద్దీ శరీరంలో మార్పులు జరుగుతాయని అందువలన మధుమేహం వ్యాధి వచ్చే అవకాశాలు పొడవుగా ఉన్న వారితో పోలిస్తే ఎక్కువని చెబుతున్నారు. పరిశోధకులు పరిశోధనల ద్వారా ఆడవారికి 33 శాతం, మగవారికి 41 శాతం సాధారణ ఎత్తు కంటే ప్రతి నాలుగు అంగళాల ఎత్తు తగ్గితే మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు. 
 
పరిశోధకులు ఎత్తు తక్కువగా ఉంటే కొవ్వు స్థాయిలు కాలేయంలో ఎక్కువగా ఉంటాయని, గుండె జబ్బులతో పాటు ఇతర జీవక్రియలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని గుండె సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. ఈ సమస్యలు అన్నీ కూడా మధుమేహానికి కారణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ఎత్తు తక్కువగా ఉన్నవారిలో వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు పరిశోధనలు చేసి చెబుతున్నారు. 
 
పరిశోధకులు పొట్టిగా ఉండే వారిలో శరీర పరిమాణం తేడా వలన మెటబాలిజంలో కూడా మార్పులు ఉంటాయని చెబుతున్నారు. మెటబాలిజంలో వచ్చే మార్పులు మహిళల్లో చిన్న వయస్సులో, యుక్త వయస్సు వచ్చే ముందు గర్భిణీగా ఉన్న సమయంలో ప్రత్యేకంగా పీరియడ్స్ సమయంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎత్తు తక్కువగా ఉన్నవారు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయని, పురుషులు బట్టతల సమస్యను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని, ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: