డయాబెటిస్ ఈ పేరు చాలామంది ప్రతిరోజూ వింటూనే ఉన్నా డయాబెటిస్ గురించి వారికి సరైన అవగాహన ఉండదు. డయాబెటిస్ లక్షణాలు కొందరిలో ఒకేసారి కనిపించగా మరికొందరిలో మాత్రం నిదానంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు మీలో ఉంటే మాత్రం అందుకు డయాబెటిస్ కారణమయ్యే అవకాశాలు  ఉన్నాయి. డయాబెటిస్ వ్యాధి వచ్చిన వారికి మూత్రం అధికంగా ఉత్పత్తి అవుతుంది. 
 
మూత్రం ఎంతగా ఉత్పత్తి అవుతుంటే అంతగా మూత విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. త్వరగా అలసిపోవడం, నీరసం, ఎప్పుడూ పడుకునే ఉండాలనిపించడం, రక్తహీనత, చర్మం ముడతలు పడటం, సెక్స్ కోరికలు తగ్గటం, కడుపులో నొప్పి, రోగ నిరోధక శక్తి తగ్గి తరచుగా వ్యాధులకు గురి కావడం, కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు, కంటిచూపు మందగించడం, శరీరం బరువు వేగంగా తగ్గిపోవడం, నాలుక తడారిపోవడం, శరీరం నిస్సత్తువుగా మారడం, ఇతర లక్షణాలు ఉంటే అది డయాబెటిస్ కావచ్చు. 
 
డయాబెటిస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1 డయాబెటిస్ కాగా రెండోది టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ చిన్నతనంలోనే గుర్తిస్తారు. దీనికోసం ఇన్సులిన్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. అసహజ జీవన శైలి, వంశపారంపర్యం వలన టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకొని ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్ల ద్వారా ఈ వ్యాధి నుండి తప్పించుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: