పచ్చికాయలలో విటమిన్ సి సమృద్దిగా ఉంది కాబట్టి ప్రతిరోజూ సేవించే వారికి ఐరన్ ఒంట పట్టడంలో సహకరిస్తుంది. ఐరన్ వల్ల రక్తవృద్ది జరుగుతుంది. ప్రతిరోజూ పచ్చిమామిడి కాయను తింటుంటే శరీరానికి వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. ఇంకా టి.బి. విరేచనాల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. గుండెదడ, అలసట, నిద్ర లేమి అంతరించి నరాలకు మంచి శక్తినిస్తుంది. పచ్చిమామిడి ముక్కలకు ఉప్పు అద్ది తింటే వేసవికాలంలో కలుగు అతిధాహం నివారిస్తుంది. ఇంకా వడదెబ్బ నుండి రక్షణ లభిస్తుంది. మానసిక చికాకు, అలసట కూడా తగ్గుతుంది. రక్తమొలలు, పచ్చకామెర్లకు చింతచిగురు, పచ్చిమామిడి కలిపి వండి, ఆహారంగా స్వీకరిస్తే పై వ్యాధులు తగ్గిపోతాయి. ఇది మంచి బలవర్థకమైన ఆహారం కూడా పచ్చికాయల నుండి స్రవించు సొనను గజ్జి, తామర, సొరియాసిస్ వ్యాధులు కలవారు ఆ ప్రదేశంలో రాస్తుంటే పై పూత మందుగా పనిచేస్తుంది. కామెర్లకు చికిత్స నెల ఉసిరిక మూలం నూరి మజ్జిగతో ఉదయం సాయంత్రం మూడురోజులు సేవించాలి. స్వరసం మజ్జిగతో ఇచ్చి మజ్జిగ అన్నం మాత్రం తినాలి. తిప్పతీగ కషాయం తేనె చేర్చికాని, ఆకుల కల్కం మజ్జిగతో కాని సేవించాలి. తెగడు చూర్ణం ఒక తులం పంచదారతో సేవించాలి. అడ్డరసం ఒక ఔన్సు తేనెతో సేవిస్తే కామెర్లు తగ్గుతాయి., త్రిఫలకషాయం తేనెతో లేక పేవరసం, తిప్పతీగెరసం తేనెతో సేవించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: