ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ను నివారణ ఎలా.. ఇప్పుడు ఇదే ప్రపంచం బుర్ర బద్దలు కొట్టుకుంటున్న ప్రశ్న. ఈ మహమ్మారికి ఇంకా మందును కనిపెట్టలేదు. అయితే ఇప్పటికే మన ఇండియన్స్ చాలా మంది తమ వంతుగా కొన్ని మందులను ప్రపోజ్ చేశారు.

 

అయితే తమిళనాడులోని కరైకుడికి చెందిన ఓ హోటల్ యజమాని మాత్రం మన సౌతిండియన్ టిఫిన్ తింటే కరోనా గిరోనా ఏమీ రావంటున్నాడు. ఈ కొత్త చిట్కాను సూచిస్తున్నారు. సిద్ధ వైద్యం ప్రకారం చిన్న ఉల్లిపాయలను తింటే ఫ్లూ తరహా వ్యాధులను తట్టుకునే రోగ నిరోధక శక్తి పెరుగుతుందట.

 

అందుకోసం తన హోటల్ లో వినియోగదారులకు చిన్న ఉల్లిపాయలతో చేసిన ఉతప్పంను తినమని చెబుతున్నారు. చిన్న ఉల్లిపాయల్లో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందట.

 

బఠానీలు కలిపి చేసిన ఆహార పదార్థాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయట. అందుకే వైరస్ను దాడి చేసినా తట్టుకునే శక్తి శరీరానికి లభిస్తుందని సదరు తమిళనాడు హోటల్ యజమాని చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: