దానిమ్మ గింజలలో ఉన్న పోషకాలతో పాటుగా ఈ చెట్టు ఆకులు, పువ్వులూ, గింజల మధ్యలో ఉండే పలుచని పొరలు చివరికి ఈ చెట్టు బెరడు కూడ ఎన్నో ఔషద గుణాలతో ఉన్నవే. భారతీయ గ్రంధాలలో హిమాలయ  ఫలంగా దానిమ్మ ప్రస్తావన ఉంది.   మనిషి ఆరోగ్యాన్ని కాపాడే దానిమ్మ గింజల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  కేవలం రుచిగా ఉండే ఫలంగానే కాకుండా మనలోని అనేక రకాల రుగ్మతలను నివారించే దివ్య ఔషధంగా దానిమ్మ ఉపయోగపడుతుంది.  దానిమ్మలో పొటాషియం, విటమిన్ "ఏ" విటమిన్ "సి" విటమిన్ "బి 6", ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు తరచూ తింటే ఇందులో ఉండే యాంటి అక్షిడెంట్స్, బ్రెస్ట్ , ప్రోస్టేట్ , స్కిన్ కాన్సెర్ , రాకుండా కాపాడుతాయి. 

 

రోజుకో గ్లాసు దానిమ్మరసం గర్బిణీలకు ఎంతో ప్రయోజనకారి. దానివల్ల కడుపులో బిడ్డకు కావలసినంత ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. క్రమం తప్పకుండ దానిమ్మ పండు తింటే చర్మం పై ముడతలు రాకుండా నివారిస్తుంది.  అంతేకాదు శరీరం లో కొవ్వు పేరుకోకుండా చూసేందుకు దానిమ్మ పండు చాల బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇదేవిధంగా దానిమ్మ రసం అధిక రక్తపోటు సమస్య తగ్గిస్తుంది.

 

ఆస్ట్రియో పోరోసిస్ ,మధుమేహం ,గుండె జబ్బు ల బారిన పడకుండా రక్షిస్తుంది. మన పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోనివ్వదు. వంద గ్రాముల దానిమ్మలో 83 కెలోరీలతో కూడిన సామర్థ్యం శరీరానికి లభిస్తుంది అని డాక్టర్స్ చెపుతారు.  కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టే దానిమ్మలో పీచు పదార్థాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ పండు చెక్కతో కాసే ఒలుంగా టీ సౌందర్య పోషకంగా ఉపయోగ పడుతుంది..ఇన్ని రకాల ఫలితాలను ఇస్తుంది కనుకే దివ్యమైన ఫలంగా దానిమ్మను గుర్తిస్తాం..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: