కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలలో విలయతాండవం చేస్తుంది. అన్ని దేశాల్లో కరోనా కు వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా లో ఇప్పటికే కరోనా మరణాలు సంఖ్య రోజు రోజు కు పెరిగిపోతున్నాయి. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు భయటపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా నియంత్రణకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇతర దేశాల నుంచి కరోనా వైరస్ తాత్కాలిక నియంత్రణకు ఔషధాలను దిగుమతి చేసుకుంటున్నారు.

 

అయితే ఇప్పుడు ట్రంప్ దృష్టి  రెమ్‌డిసివిర్ ఔషధం మీద పడింది.  కరోనా వైరస్ చికిత్సలో రెమ్‌డిసివిర్ ఔషధం మెరుగ్గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఔషధ ఉత్పత్తిలో 90 శాతం ఉత్పత్తిని అమెరికా కొనేసింది. దానికి సంబందించిన ఒప్పందాన్ని ఆ ఔషధ తయారీ సంస్థ గిలీక్ తో ఒప్పందం కుదుర్చుకుంది.ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ఆ ఔషధాలను తమకే ఇవ్వాలని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం డీల్ కుదుర్చుకున్నది. గిలీడ్ సైన్సెస్ సంస్థ ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నారు. అయితే కోవిడ్ భారిన పడిన వారు  ఈ ఔషధం తో కరోనా నుంచి త్వరగా కోలుకుంటున్నట్లు తేలింది. ట్రంప్ సర్కార్ గిలీడ్ ఈ ఒప్పందం కుడిరినట్లు
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ శాఖ తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది. 

 

 


జూలైలో జరిగే వంద శాతం ఉత్పత్తిని అంటే సుమారు 5 లక్షల డోస్లు, ఆగస్టులో 90 శాతం, సెప్టెంబర్‌లో 90 ఔషధ సరఫరాను కూడా తమకే ఇవ్వాలని ట్రంప్ సర్కార్ గిలీడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది.దక్షిణ కొరియాలో రెమిడిసివిర్ ఔషధ వినియోగం ప్రారంభమైంది. న్యూమోనియా వ్యాధితో బాధపడేవారు, ఆక్సిజన్ థెరపి తీసుకుంటున్నవారికి రెమ్‌డిసివిర్ ఔషధం పనిచేస్తుందని గిలీడ్ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొన్నది.
ఎబోలా వ్యాధి చికిత్సలోనూ ఈ ఔషధాన్ని వాడారు.  అయితే ఈ ఔషధమ్ యాంటీ వైరల్  డ్రగ్ గా క్లినికల్ గా నిరూపితమైంది. మొత్తానికి ఈ ఔషధం ఎలా పనిచేస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: