పసుపుతో ప్రాచీన కాలం నుండి భారతీయులు వంటకాలలో పసుపుకు చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. కానీ ఈ తరంలో తెలియని తనం వల్ల పసుపు యెక్క ప్రాధాన్యతను కొందరు విస్మరిస్తున్నారు. పసుపు కేవలం వంటకానికి రంగును తెచ్చేది మాత్రమే కాదు. పసుపుతో నీరుకలిపి మెత్తగా పేస్ట్ లా చేసి క్రమంగాలోనికి తీసుకుంటే శరీరానికి చురుకుదనం పెరుగుతుందని ఆయుర్వేధం వెల్లడిస్తోంది. పసుపును వాడిన ఆహారము చర్మరోగాలను హరిస్తుంది. కొన్ని సార్లు మనం తీసుకునే ఆహారంలో విషపధార్థాలు లేక మలినపధార్థాలు కలిసి ఉండి మనలోకి వెళుతాయి. పసుపు కావాలిసినంతగా కలిపిన ఆహారం విష మరియు మలిన పధార్థాలను పసుపు తొలగిస్తుంది. గ్యాస్ట్రబుల్ మరియు కడుపులో మంటలాంటి సమస్యలను పసుపు ఓ చక్కని రోగనివారిణిగా గుర్తించబడుతుంది. సౌందర్యాన్ని మెరుగు పరిచే పరిశ్రమలు కూడా పసుపుకు ఎంతో ఋణపడి ఉన్నాయి. మెత్తగా పేస్టులా కలిపి చర్మానికి రుద్దుకున్నట్లయితే చర్మం నునుపుగా మారి తేజోవంతమవుతుంది. అలా పసుపు బాహ్య మరియు అంతరప్రయోజనాలకు ఎంతాగానో ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: