మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతుంటారు. అలాంటి వారు ప్రతి రోజు గ్రీన్ టీ సేవిస్తుంటే బ్రెస్ట్   క్యాన్సర్ ను నిరోధించవచ్చంటున్నారు వైద్యనిపుణలు. ప్రతి రోజు మూడు నుంచి ఆరు కప్పులు గ్రీన్‌ టీని తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ కణాలను నివారించవచ్చని వారు అంటున్నారు అలాగే కొవ్వు పదార్థాల వాడకాన్ని కూడా చాలా వరకు తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు.  పాలతో తయారు చేసే పదార్థాలు కానీ, కొవ్వు అధికంగా ఉండే ఇతర పదార్థాలను వీలయినంత తక్కువగా వినియోగించాలి. శరీరంలో కొవ్వు శాతం అధికంగా చేరితే ఆరోగ్యానికి ప్రమాదకరం. పైగా కొవ్వు అధికంగా చేరితే క్యాన్సర్‌‌ను కొని తెచ్చుకున్నట్లేనంటున్నారు వైద్యులు.  మనం ఆహార పదార్థాలలో రుచి కోసం ఉప్పును వాడుతుంటాం. ఉప్పు అన్ని రకాల వ్యాధులకు ప్రధాన శత్రువుగా కూడా చెప్పుకోవచ్చు. తరచూ ఉప్పు అధికంగా తీసుకోవడం వలన క్యాన్సర్‌ రావడానికి ఆస్కారముందని ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఉప్పు వాడకాన్ని వీలయినంతగా తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: