తలనొప్పిగా ఉన్నప్పుడు గోరింటాకు నూరి తలపై లేపనం పూయాలి. ఇందువల్ల తలనొప్పి దూరమవుడమేకాక తలకు చల్లదనం లభిస్తుంది. గోరింటాకు తైలం వెంట్రుకలకు రాయడం వల్ల చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటం అరికట్టవచ్చు. జుట్టు ఒత్తుగా, అందంగా తయారవుతుంది. తలలో పేలు నశిస్తాయి.  తలలో ఎక్కడైనా దెబ్బ తగిలి బొప్పికడితే గోరింటాకు నూరి పట్టీవేస్తే నొప్పి తగ్గడమే కాకుండా పుండు నయమవుతుంది. చర్మరోగం వున్న రోగికి నూరిన గోరింటాకు రాస్తే శరీరంలో పడ్డనల్ల మచ్చలు దూరమవుతాయి. గోరింటాకు, సబ్బు సమపాళ్లలో కలిపి మచ్చలపై రాయాలి. అరకాళ్ళుకు గోరింటాకు నూరి రాసుకుంటే శరీరంలో అధకంగా వున్న ఉష్ణం తగ్గుతుంది. దీనితో పసుపు కలిపి రాస్తే పాదం మెత్తపడుతుంది. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు అరికాళ్లకు, అరిచేతులకు గోరింటాకు రాసుకుంటే స్వస్థత చేకూరుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: