పిల్లల్లో అధిక బరువు ఎన్నో ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. గుండెజబ్బులు, నిద్ర లేమి మొదలైన వ్యాధులు వస్తాయి. అధిక బరువు అంటే శరీరంలో అనవసరమైన కొవ్వు కణాలు బాగా పెరిగిపోవటం. పిల్లల అధిక బరువు సమస్యను పరిష్కరించటం చాలా కష్టం. ఆహారం సరిగా తీసుకోకపోవడం, అనారోగ్య జీవన విధానం, తిండి అలవాట్లు, వంశపారంపర్యత మొదలైనవి పిల్లల్లో గల అధిక బరువుకు కారణాలుగా వైద్యనిపుణులు చెపుతారు. అయితే, ఒక ఆరోగ్యవంతమైన పోషకాహార ప్రణాళికతో తగినన్ని న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీనులు అధిక బరువు పిల్లలకు చాలా మంచిది. ఇటువంటి ఆరోగ్యకరమైన ఆహారం  పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లలలో కల ఈ అధికబరువు సమస్యను పరిష్కరించగలదు. అందుకు కొన్ని టిప్స్ పాటించేందుకు ఇవి పరిశీలించండి.... ఆల్ఫాహారం : బ్రేక్ ఫాస్ట్ పెద్దలకు మాత్రమే కాదు పిల్లలకు కూడా చాలా ప్రధానమైనది. ఉదయం వారు తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ తో వారి మెటబాలిజం సమర్ధవంతంగా పనిచేస్తుంది. అందుకు వెన్న తీసిన పాలు, పండ్లు.  ఉదాహారణకి : యాపిల్, అరటి వంటి అందివ్వడం ద్వారా ఇవి ఆరోగ్యం మాత్రమే కాదు, రుచి తగినన్నిపోషకాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. అలాగే ఫింగర్ మిల్లె లేదా రాగిజావా వంటివి కూడా చాలా ఆరోగ్యకరమైన న్యూట్రీషియన్ బ్రేక్ ఫాస్ట్. పండ్ల రసాలు: కార్బన్ కల కూల్ డ్రింకులు పట్టకండి. వీటికి పోషక విలువలు లేకపోగా శరీరానికి కొవ్వు చేర్చే గుణం వుంది. తియ్యగా వున్న డ్రింకులు అంటే జ్యూసులు, ఫ్లేవర్డ్ మిల్క్ కూడా ఇవ్వకండి. ఆరోగ్యకరమైన జ్యూసులు ఉదాహరణకు ఆరెంజ్, వాటర్ మెలోన్, పపాయ, యాపిల్ మరియు ద్రాక్ష జ్యూసులను ఇవ్వడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అంది, ఎక్కువ ఎనర్జీని అందిస్తాయి. ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఇటువంటి జ్యూసులను అధిక బరువు ఉన్న వారికి ఇవ్వడం వల్ల వారికి ఎక్కువగా ఆకలి కానివ్వదు. ఇంకా వీటిలో ఉండే ఫైబర్ క్రొవ్వు కరగడానికి సహాయపడుతుంది. కూరగాయలు : పిల్లలు లావుగా ఉంటే వారిని నిత్యం ఆహార పదార్థాల జోలికి వెళ్ళకుండా మీరు నివారించాలి. వారికి తగిన పోషక విలువలతోకూడిన ఆహార పదార్థాలను ఇవ్వడంతోబాటు ప్రతిరోజూ వ్యాయామాన్నికూడా అలవాటు చేయాలి. ముఖ్యంగా వారు తీసుకొనే ఆహారంలో వెజిటేబుల్స్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. వెజిటేబుల్స్ ను ఉడికించి లేదా ఫ్రై చేసి లేదా సలాడ్స్ లేదా పాస్తారూపంలో అందివ్వాలి. సాధారణంగా అధిక బరువు ఉన్న పిల్లలు ఒక బౌల్ వెజిటేబుల్ ప్రతి రోజూ తినాలి. ఉదా: బ్రొకోలి, క్యారెట్, బీన్స్, మరియు ఆకుకూరలు, ఉల్లిపాయలు తప్పనిసరిగా అందించాలి. స్నాక్స్: కీరదోసతో ధాన్యంతో తయారు చేసిన బ్రెడ్ రెండు స్లైసులు, టమోటో, ఉల్లిపాయ, లోకాలరీ చీజ్ వంటవి అందించాలి. వీటిని తినడం వల్ల లోఫ్యాట్ మరియు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక కప్పు ఆరెంజ్ మరియు వాటర్ మెలోన్, పీచ్ జ్యూసుల్లో సాన్ షుగర్ ఉంటుంది. కాబట్టి ఈ జ్యూసులకు పంచదార బదులు, తేనె మిక్స్ చేసి ఇవ్వండి. బేకరీ ఫుడ్స్ ప్రమాదం : అధిక బరువుకు కారణం అయ్యే స్వీట్స్, పిల్లాడి ఆహారంలో ఫాస్ట్ ఫుడ్ లేకుండా చూడండి. ఫ్రెంచి ఫ్రైస్, హాంబర్జర్స్, చిప్స్, ఫ్రైడ్ చికెన్, మిల్క్ షేక్స్ మొదలైన కొవ్వు వున్న పదార్ధాలు తిననీయకండి. ఇవన్నీ తర్వాతి దశలో గుండె జబ్బులు తెచ్చే ప్రమాదం వుంది. డిన్నర్: అధిక బరువు ఉన్న పిల్లలకు, ఊబకాయస్తులకు ప్రతి రోజూ రాత్రి సమయంలో ఇచ్చే ఆహారం రెండు చపాతీలు, ఒక బౌల్ సలాడ్ లేదా అధిక ప్రోటీనులను కలిగిన మొలకెత్తిన విత్తనాలు ఇవ్వడం వల్ల డిన్నర్ ఫుల్ ఫిల్ చేయబడుతుంది. పిల్లల శరీరానికి వ్యాయామం : పిల్లల శరీరానికి వ్యాయామం తప్పనిసరి. అందులో జాగింగ్, పరుగు(రన్నింగ్) ఆటలు మొదలైనవి అవసరం. తక్కువ దూరంలోనున్న ప్రాంతాలకుకూడా వాహనాల్లో వెళ్ళనివ్వడం సమంజసం కాదు. వారిని నడిచి వెళ్ళేలా చేయడం తల్లిదండ్రుల కర్తవ్యం. పిల్లలను వారానికి ఒకసారి జూ, పార్క్ లేదా మ్యూజియం లాంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళండి. అక్కడ పిల్లలకు నడిచే అలవాటుతోబాటు వారికి కాస్త వ్యాయామం చేసే అవకాశం కలుగుతుంది. ఇంట్లోని చిన్న-చిన్న పనులు పిల్లలకు పురమాయించండి. ఉదాహరణకు వాహనాలను శుభ్రపరచడం, గోడలకు అంటిన దుమ్ము-ధూళిని తొలగించడం, బూజు దులపడంలాంటివి. దీంతో పిల్లలకు తాముకూడా ఇంటి పనుల్లో భాగస్వాములైనామన్న ఆనందం కలుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: