గర్భం ధరించాక, ప్రసవం తర్వాత వక్షోజాలలో అనేక అనేక కారణలతో  అనేక రకాల మార్పులు చెందుతాయి.  ప్రసవం అనంతరం అసలైన లాక్టేషన్ ఆరంభం అవుతుంది. పాల ఉత్పత్తి, లాక్టేషన్ సామర్థ్యాలు బాగున్నపుడు లాక్టేషన్ స్థిరమవుతుంది. ప్రసవం తర్వాత రెండు, మూడు రోజుల్లో ఉత్పత్తి అవుతున్న పాలన్నిటినీ బిడ్డ తాగలేదు కనుక వక్షోజాలు బాగా బరువుగా అనిపిస్తు నిండుగా ఉన్నట్లు అనిపిస్తాయి. 

బిడ్డ బాగా పాలు తాగడం మొదలుపెట్టాక ఈ సమస్య తగ్గిపోతుంది. స్తనాలు భారీగా, సున్నితంగా ఉండటం, నిపుల్స్ పగిలి మంటపెట్టడం వంటి సమస్యలుంటాయి. దురద.. ర్యాషెస్ ప్రసవం తరువాత వచ్చే సమస్యలు. పాలు ఎక్యుమిలేట్ కావడం వల్ల, పాపాయి నోటి వల్ల వస్తుంది సమస్య తలెత్తవచ్చు. కనుక వక్షోజాలను నెమ్మదిగా మసాజ్ చేసుకుంటూ, పాలను నొక్కి వేయాలి. 

అదేవిధంగా నిపుల్స్ పొడిబారడం వల్ల వాటి చుట్టూ ఉండే నల్లని వలయం పెరగడం వల్ల దురద వస్తుంది. ఆలివ్ ఆయిల్, పాలు కలిపి రాయండి. పాపాయి నిపుల్ సరిగ్గా పట్టుకోలేకపోవడం వల్ల పగుళ్లు ఏర్పడతాయి. ఇపుడు అనేక రకాల బ్రెస్ట్ పంప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటితో సమస్యను అధిగమించవచ్చు. సమస్య మరీ ఎక్కువగా ఉందనిపిస్తే మీ వైద్యురాలి సలహా తీసుకోవాలి. అంతేతప్ప స్తనాల్లో సమస్య ఉందని బిడ్డకు పాలివ్వడాన్ని మాత్రం ఆపకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: