బిజీ బిజీ లైఫ్, మారిపోయిన ఆహారపు అలవాట్లు, తిండి విషయంలో సరైన సమయాన్ని పాటించకపోవడం వెరసి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ తీవ్రమవుతున్నాయి. వయసులతో సంబంధంలేకుండా చిన్నా పెద్దా అందరినీ అల్సర్, గ్యాస్టిక్ పెయిన్ వేధిస్తోంది. జీర్ణాశయంలో ఆహారాన్ని డైజేషన్ చేసే యాసిడ్స్ (ఆమ్లాలు) హెచ్చు తగ్గుల కడుపునొప్పి, గ్యాస్, వికారం వంటివి వస్తుంటాయి.
Image result for గ్యాస్ట్రిక్
గ్యాస్టిక్ సమస్యను ఎదుర్కొనేవారు ఆహారాన్ని కొద్ది మొత్తాల్లో తినాలి.. అదీ రోజుకు ఎక్కువ సార్లు తీసుకోవాలి. నెమ్మదిగా తినాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. మింగరాదు. బబుల్ గమ్మ్ నమలటం, గట్టి కాండీలు తినటం చప్పరించటం, స్ట్రాతో తాగటం మానేయాలి. పొగత్రాగటం మానేయాలి, ఎందుకంటే సిగరెట్ తాగే సమయంలో పొగతో పాటు జీర్ణావయవాల్లోని మ్యూకస్ పొరలను రేగేలా చేసి గ్యాస్ ని కలిగిస్తుంది. ఇక ఈ సమస్యను వంటింట్లో ఉండే సులభమైన పదార్థాలను వినియోగించి తగ్గించుకోవచ్చు.
Image result for గ్యాస్ట్రిక్
* వామును దోరగా వేయించి,పొడి చేసుకుని పావు చెంచాడు మోతాదుగా వేడి అన్నంల్లో, మొదటి ముద్దతో కలిపి వాడితే పొట్ట ఉబ్బరింపు బాధించదు.
 
* జీలకర్ర 2 భాగాలు,సొంఠి 4 భాగాలు,ఉప్పు 1 భాగం వీటన్నింటినీ మెత్తగా నూరి,నిష్పత్తి ప్రకారం కలిపి సీసా లో నిల్వ చేసుకోవాలి.పొట్ట ఉబ్బరించినప్పుడు ఈ మిస్రమాన్ని అర చెంచాడు
మొతాదుగా వీడినీళ్ళతో కలిపి సేవించాలి.
 
* ఇంగువను దోరగా వేయించి, పొడి చేసుకుని పావు చెంచాడు మోతాదుగా వేడి వేడి అన్నంతో, మొదటి ముద్దతో కలిపి తినాలి.
 
* ఆకలి లేకపోవటం వల్లపొట్ట ఉబ్బరిస్తుంటే జీలకర్రను దోరగావేయించి, పొడి చేసి అరచెంచాడు నుంచి చెంచాడు మొతాదుగా భోజనానికి ముందు అరకప్పు వేడి నీళ్ళలో కలిపి తాగాలి.
 Image result for గ్యాస్ట్రిక్
* వాము, అల్లం, జీలకర్రను సమాన భాగాలుగా తీసుకుని సైంధవ లవణంగా కలిపి నూరి ఉదయం సాయంకాలం సేవించాలి.
 
* నిత్యం కడుపు ఉబ్బరంతో బాధపడేవారు అను నిత్యం భోజనానికి ముందు రెండు మూడు అల్లం ముక్కలను ఉప్పుతో అద్దుకుని తింటుండాలి.
 
* ఉదరకండరాల మీద టర్పంటైన్ ఆయిల్ ని వేడి చేసి ప్రయోగించి ఉప్పు మూటతో కాపడం పెట్టుకోవాలి.అల్సర్, గ్యాస్టిక్ పెయిన్ తీవ్రంగా ఉన్నవారు కొద్ది రోజులు ఇలా చేయాలి:చ‌ల్ల‌ని పాలు

ఒక గ్లాస్ చ‌ల్ల‌ని పాల‌ను చ‌క్కెర లాంటివేవీ క‌ల‌ప‌కుండా తాగాలి. దీని వ‌ల్ల క‌డుపులో మంట‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి. అంతేకాదు పాలు చ‌ల్ల‌గా ఉండ‌డం వ‌ల్ల పొట్ట‌లో చ‌లువ‌ను పెంచుతాయి. పాల‌లో ఉండే కాల్షియం క‌డుపులో అధికంగా ఉన్న ఆమ్లాల‌ను పీల్చుకుని గ్యాస్ స‌మ‌స్య నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తుంది. అయితే పాల‌కు ఒక టీస్పూన్  మోతాదులో నెయ్యిని క‌లిపి తీసుకోవ‌చ్చులవంగాలు  లవంగాలు గ్యాకి కారణమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. రెండు లవంగాలు, రెండు యాలకులను మెత్తగా చేసి తినాలి. ఈ సమస్యను తగ్గించటమే కాకుండా చెడు శ్వాసను కూడా తగ్గిస్తుంది.

మజ్జిగ ఎసిడిటి వల్ల వచ్చే కడుపు నొప్పి, గ్యాస్ వంటి వాటిని చాలా సమర్థంగా తరిమికొట్టే సామర్థ్యం మజ్జిగకుంది. ఒక స్పూన్ మెంతులను నానబెట్టి మెత్తని పేస్టుగా చేసి గ్లాసు మజ్జిగలో కలిపితాగాలి. అదనపు రుచి కోసం కొంచెం నల్ల మిరియాల పొడి, కొత్తిమీర కలపొచ్చు.దాల్చిన చెక్క దాల్చిన చెక్క జీర్ణ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది సహజ ఆమ్ల హారిణిగా పనిచేస్తుంది.

కడుపులో గ్యాస్ ను తరిమేయడానికి సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో అరస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి.తులసి తులసి ఆకుల్లో ఉండే సహజ లక్షణాలు పొట్ట ఉబ్బరం, గ్యాస్ వికారం వంటి వాటికి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. కొన్ని తులసి ఆకులను నమలొచ్చు. రెండు కప్పుల నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటిని తాగొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: