రక్తపోటు పెరిగిన వారికి ఉండే లక్షణాలు:

తల బరువుగా ఉన్నట్లుగా అనిపించి కళ్ళు తిరగటం,వికారం ,తలనొప్పి ఉంటాయి .
గుండె పట్టినట్లు ఉండి గుండె దడతో ఊపిరి పీల్చ లేకపోతారు,
కందగడ్డలాంటి మొఖంతో, కళ్ళు ఎరుపులెక్కి,కోపం చిరాకుతో మండిపడి పోతుంటారు.
అప్పుడు శరీరం ఒణుకు అలసట నీరసం నిద్ర పట్టదు. 

రక్తపోటు కారణాలు:  పిట్యూటరీ ,థైరాయిడ్,అడ్రినల్ మొదలగు గ్రంధుల లోపాలవలన వాటి ఉత్పత్తుల సమతుల్యాన్ని కోల్పోవటం, వారసత్వం,ఊబకాయం, అధిక బరువు పెరగడం,నిత్యము వ్యాయామం చేయకపోవటం,తరచూ అధిక మానసిక వత్తిడికి లోనవటం ,వయోభారం,అధిక ఉప్పు,మసాలా వాడకం,ఆల్కహాల్,సిగరెట్, గుట్కా, జరదా,మత్తు మందులు ఎక్కువగా వాడకంతో పాటు , వెన్న,నెయ్యి, మీగడ,బాకారి ఫుడ్డు ,జంక్ ఫుడ్డు,బిర్యానీ,పులావ్ లాంటి మసాలా ఫుడ్స్  తరచుగా తీసుకోవటం హై బీపీ రావటానికి ముఖ్య కారణాలుగా చెప్పుకొనవచ్చును. 

sleep well


పద్దతైన ఆహార నియమాలను పాటిస్తే రక్తపోటును (బీపీ) నియంత్రించవచ్చు. ఇది నిపుణులు చెబుతున్న మాట.


*అధికంగా ఉప్పు వాడే వారు బిపి భారైన పడటం మనం చూస్తూనే ఉన్నాం. 

*కొవ్వు పదార్థాలను తినేవారికి బీపీలో హెచ్చుతగ్గులు గణనీయంగా ఉంటాయని అంటున్నారు. 

Image result for blood pressure

వీరితో పోల్చితే, తక్కువ పరిమాణం లో ఉప్పు, కొవ్వు పదార్థాలను తినేవారి లో రక్తపోటు సాధారణ స్థితి లోనే ఉండటం జరుగుతుందని పరిశోధకులు గమనించారు. అంతే కాదు కారం, మసాలాలు తక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవటం అవసరం. అవి రుచిగా ఘుమ ఘుమ లాడటానికి కారణం వాటిలో ఉండే ఉప్పు కారమే. 

Image result for fats dangerous and leads high bp

రక్తపోటు పెరగటానికి ప్రధానంగా"ఉప్పు"దోహదం చేస్తుంది. అందువల్ల ఆహారంలో రోజుకు "3-4 గ్రాములు" మించకుండా ఉప్పుఉండేలా చూసుకోవాలి. పచ్చళ్లు,వడియాలు వంటి నిల్వ పదార్థాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. పదార్ధాలు నిలవ ఉండటానికి కారణం అందులో ఉండే ఉప్పే. అందుకే నిలవ ఉండే పదార్ధాలను రక్తపోటు బాధితులు మానేస్తే సరి. ఉప్పుకు ప్రత్యామ్నాయం "సైంధవ లవణం-రాక్‌సాల్ట్ అది వాడితే కొంతవరకు ప్రయోజనం ఉంటుందని అంటారు. 
Image result for salt and rock salt
బిపి ఉన్నవారు కొవ్వు తక్కువ ఉండే, పప్పు దినుసులు, గింజలు, చేపలు వంటి ఆహారం నియమబద్ధంగా తీసుకోవటం జరగాలి. ఎక్కువ సార్లు టీ, కాఫీలు తీసుకోవడం అంత మంచిద్కాదు.


ధూమపానం, మద్యపానం, గుట్కా ఇలాంటివి రక్తపోటునుపెంచే ఉత్ప్రేరకాలు. అందువలన వాటికి దూరంగా ఉండటంవల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.రోజుకు 3-4 గ్రా. ఉప్పు వాడితే పరవాలెదు కాబట్టి మరీ ఇష్టమైతే రోజు కొక పదార్ధం అతితక్కువ పరిమాణంలో తీసుకొని  "జిహ్వ చాపల్యం" ను సంతృప్తి పరచుకోవచ్చు.

Potassium rich food

పొటాషియం శరీరంలో ప్రతికూల చర్యలను కలుగచేస్తుంది; ఏది ఏమైనప్పటికీ, ఇది శరీరానికి కావలసిన మినరల్ మరియు సోడియానికి వ్యతిరేఖంగా ఉంటుంది. కావున తీసుకునే ఆహరంలో సోడియానికి బదులుగా పోటాషియంను వాడటం మంచిది. బంగాళదుంప, నారింజ పండు రసం, అరటిపండు, ఎండుద్రాక్ష వంటి సహజసిద్ధంగా ఎక్కువ పొటాషియంను కలిగి ఉన్న పండ్లని తినండి. మీరు ఎక్కువగా తినే ఆహరంలో వీటిని కుడా చేర్చుకోవటం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: