అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యుని దగ్గరకు వెళ్లడం.. వైద్యులు కొన్ని మాత్రలు రాసివ్వడం సాధారణంగా జరిగేదే.. ఇంజక్షన్ చేయించుకోవడానికి చాలామంది భయపడతారు కానీ.. మాత్రల విషయంలో పెద్దగా సమస్య ఉండదు. కానీ ఈ మాత్రలు వేసుకోవడంలోనూ కొన్ని జాగ్రత్తులు తీసుకోవాల్సి ఉంటుంది. 

Image result for how to swallow tablets
కొంతమంది మాత్రలు పెద్దగా ఉన్నాయనో.. గొంతులో ఇరుక్కుంటుందనో మాత్రలను తుంచి వేసుకుంటుంటారు. ఇలా ఎన్నడూ చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. మరికొందరేమో మాత్ర డోస్ ఎక్కువ అవుతుందేమోనని సగానికి తుంపి సగం ముక్క నోట్లో వేసుకుంటుంటారు. కానీ ఇది అంత మంచి అలవాటుకాదట. 

Related image
ఇలా మాత్రను తుంచి వేసుకోవడం ప్రమాదకరం. ఎందుకంటే మాత్రల్లో థెరపటిక్, టాక్సిక్ డోసులు ఉంటాయి. వీటి మధ్య మార్జిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మాత్రను తుంపినప్పుడు డోసులు తారుమారై తీవ్రపరిణామాలు కూడా ఏర్పడవచ్చట. అందుకే వైద్యులు ప్రత్యేకంగా చెబితే తప్ప.. మాత్రలను ఎపుడూ తుంటి వేసుకోకూడదట. 



మరింత సమాచారం తెలుసుకోండి: