ఏ సీజన్‌లో దొరికే పండ్లు ఆ సీజన్‌లో తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతారు. ప్రస్తుతం మార్కెట్‌లో నేరేడు పండ్లు విరివిగా లభిస్తున్నాయి. వీటిని నగరవాసులు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు.    నేరేడు పండ్లలో ఉండే పోషకాలు గైనమిక్‌ ఇండెక్‌ శాతాన్ని సమతుల్యం చేస్తుంది. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపుతుంది. నేరేడుపండ్లలో కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌, సోడియం, విటమిన్‌ సి, పొలిక్‌ యాసిడ్‌, పీచు ప్రోటీన్లు, కెరోటిన్లు అధికంగా లభిస్తాయి. నేరేడు పండ్లను తీసుకుంటే మధుమేహ వ్యాధి నియంత్రణ, రక్తహీనత, చిగుళ్ల నుంచి రక్తకారడం, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Image result for alla neredu

ఈ పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే రక్తంలో చక్కెరస్థాయి అదుపులోకి వస్తుంది. రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్న వారు వీటని తీసుకుంటే శరీరానికి మంచిది. శరీరానికి ఇనుము అందుతుంది. నీరసం తగ్గి తక్షణమే శక్తి అందుతుంది.

Image result for alla neredu

100 గ్రాముల నేరేడు పండ్లలో 55 శాతం పొటాషియం ఉంటుంది. గుండె, మెదడు, రక్తపోటు ఉన్నవారు ఒక పండు తింటే సరిపోతుంది. అరుగుదల సరిగ్గా లేనప్పుడు కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండ్ల రసం కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. నేరేడు పండ్లు తీసుకుంటే రక్తం కారడం, దంతాలు పుచ్చిపోవడం, దుర్వాసన రావడం వంటి సమస్యలు పరిష్కారమవుతాయు.

Image result for alla neredu

నమిలినప్పుడు పులుపు, వగరు కలపోతగా ఉండి బ్యాక్టీరియాను దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నేరేడు పండ్లు తింటే విటమిన్లు అంది రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.మి నవీన్ నడిమింటి 


నేరేడు పండ్లలో మాత్రమే ఆ శక్తి ఉంది..
వేసవిలో లభించే పులుపు కలగలిపిన పండ్లు కావడంతో రుచిలో పండు నోరూరిస్తుంది. దీనిని ఆయుర్వేదంలో ఔషధ ఫలంగా అభివర్ణిస్తారు. పేగుల్లో ఉండే వెంట్రుకలను సైతం శరీరం నుంచి బయటకు పంపించే శక్తి అల్లనేరేడుకు మాత్రమే ఉంది. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం కలిగించి ఒంటికి చలువ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్థి చేసి ఆకలిని పెంచుతుంది. పైత్యాన్ని విరోచనాలను తగ్గిస్తుంది.

Image result for alla neredu

ప్రయోజనాలు :
సీజన్‌లో ప్రతి రోజు 10 నుంచి 20 అల్లనేరేడు పళ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.వేసవిలో అతి దాహన్ని అరికడుతుంది. ఒంటికి చలువనిస్తుంది. మూత్రం రాక ఇబ్బంది పడే వారికి అల్లనేరేడు పండ్లు ఔషధం లాంటిది. కిడ్నిల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. చిన్న చిన్న రాళ్లను సైతం కరిగిస్తుంది.కడుపులోనులి పురుగులను నివారిస్తుంది. నోటి, మూత్రాశయ క్యాన్సర్‌కు టానిక్‌లా పని చేస్తుంది.చిగుళ్ళు వ్యాధులతో బాద పడే వారు ఈ చెట్టు బెరడు, ఆకులు రసాన్ని పుక్కిలిస్తే చాలా మంచిది.కడుపులో ప్రమాదవశాత్తు చేరుకున్న తల వెంట్రుకలు, లోహపు ముక్కలను సైతం కరిగిస్తుంది.

అల్లనేరేడు కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది.అల్లనేరేడు రసంలో కొంచెం చెక్కర కలిపి తాగితే నీళ్లు విరోచనాలు తగ్గుతాయి.పంచదారకు బదులు తెనే కలిపి తాగితే అరికాళ్లు, అరి చేతులు మంటలు, కళ్లు మంటలు తగ్గుతాయి.విత్తనాలు ఎండబెట్టి చేసిన చూర్ణం తీసుకుంటే అతి మూత్రవ్యాధి అదుపులోకి వస్తుంది.పండ్లే కాదు నేరేడు ఆకును గాయంపై కట్టుగా కట్టవచ్చు.అల్లనేరేడు పుల్లతో పండ్లుతోముకుంటే చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.చిగుళ్ళు నుంచి రక్తస్రావం తగ్తుతుంది. నోటి దుర్వాసన దూరమవుతుంది.లేత ఆకులతో కషాయం కాసి రోజుకు మూడు సార్లు నాలుగైదు టేబుల్‌ స్పూన్లు తాగితే డయేరియా, మొలలు తగ్గుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: