యోగా దినొత్సవం ఏలా ప్రారంభమైంది
Image result for yogeshwar krishna

యోగీశ్వర్ కృష్ణ

ప్రపంచ యోగ దినోత్సవమును ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు.  ఈ ప్రతిపాదనకు వెనువెంటనే జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని 193 సభ్య దేశాలకు గాను 177 దేశాలు ఏకగ్రీవంగా ఓటేశాయి. 
Related image
తరువాత డిసెంబరు 11 న ఐక్యరాజ్యసమితి భారత ప్రధాని సూచించిన జూన్ 21 నాడు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవమును జరుపుకోవాలని అధికారిక ప్రకటన చేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధాన వేదిక కోసం కేంద్రం 4 నగరాల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో హైదరాబాద్‌, జైపూర్‌, అహ్మదాబాద్‌, మైసూర్‌లు చోటు దక్కించుకున్నాయి. యోగా దినోత్సవం నిర్వహణకు కసరత్తులు ప్రారంభించిన కేంద్రం యోగా దినోత్సవం నిర్వహణకు  తమను సంప్రదించిన పలు రాష్ట్రాలు, వాటి స్పందనల ఆధారంగా ఈ 4 నగరాలను ఆయుష్‌ మంత్రిత్వశాఖ ఎంపిక చేసింది. 
Related image
ఆదియోగి మహశివ

ఆనాడే యోగాను అతిపెద్ద కార్యక్రమంగా మలచాలని దీన్ని ఒక రోజుకు పరిమితం చేయకుండా ఏడాదంతా నిర్వహించాలని ఇందులో భాగంగా 100 పార్కులను యోగా కార్యక్రమాల కోసం కేటాయిస్తూ కేంద్రం ప్రకటన చేసింది. యోగను శాస్త్రీయంగా క్రోడీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి. ఉపనిషత్తుల లోను, భగవద్గీతలోను యోగా ప్రస్తావన ఉంది. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకే ఉందని పరిశోధనల్లో తేలింది. భారతదేశంలో పురుడు పోసుకున్న యోగా నేడు ప్రపంచ మంతా పాకింది. ఐదు సహస్రాబ్దాలకు పైగా భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైన యోగవిద్యను యావత్ ప్రపంచం ఎప్పటి నుంచో అనుసరిస్తుంది.
 Image result for YOGA
భారతీయ సనాతన యోగశాస్త్రానికి ఉన్న విలువను, దాని ప్రాశస్త్యాన్ని అంతర్జాతీయ సమాజం అధికారం గా గుర్తించిన సంవత్సరంగా 2014 సంవత్సరం నిల్చి పోయింది. భారత ప్రధాని  మోదీ 2014 సెప్టెంబరు 27వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రతిపాదన చేశారు. యోగా ప్రాధాన్యతను గూర్చి నరేంద్ర  మోదీ వివరిస్తుంటే సభ్యులంతా శ్రద్ధగా విన్నారు. యోగా ఒక్క భారతదేశానికే పరిమితం కాదని, ఈ భూమ్మీద ప్రతి మనిషికి యోగాసనాలు అవసరమేనని నరేంద్ర మోదీ తనదైన పంథాలో విడమర్చి వివరించారు. 
 Image result for founder of yoga patanjali  
2015 జూన్ 21న ఢిల్లీ రాజ్‌పథ్‌లో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించింది. అదేరోజు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించడం మరో విశేషం. ఒకే వేదికపై 35,985 మంది యోగా చేసిన మెగా ఈవెంట్‌తో పాటు, 84 దేశాల పౌరులు పాల్గొన్న ఏకైక యోగా కార్యక్రమం గా జంట రికార్డులు నమోదయ్యాయి. 

ప్రతి రోజూ యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. యోగా చేసిన వారికి, యోగా చెయ్యని వారి ఆరోగ్యం లో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. యోగాకు భారతదేశంలోని ప్రజలు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి రోజు ఒక గంట సేపు యోగా చేస్తే ఎంతో హాయిగా, ఉల్లాసంగా ఉంటుంది. 2015 లో ఢిల్లీలోని రాజ్ పథ్ లో 35,985 మందితో ఒకే సారి యోగా చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు, మరల 2017 ఆ రికార్డు బద్దలు కొట్టడానికి మైసూరు నగరం వేదిక అయ్యింది

Image result for founder of yoga patanjali                      యోగా దినొత్సవం 2017


మైసూరు జిల్లా కలెక్టర్ అంతర్జాతీయ యోగా దినోత్సవం గ్రాండ్ గా నిర్వహించి అందుకోసం ఓ సరికొత్త ప్రయోగం చేశారు. మైసూరు నగరంతో పాటు ఆ జిల్లా మొత్తం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మీరు పాల్గొనండి అంటూ ప్రచారం చేశారు. 50 వేల మంది టార్గెట్ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గోనడానికి ఆసక్తి ఉన్న ప్రజలు తమ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 
Image result for YOGA
50 వేల మందితో ఒకే చోట యోగా చేసి ప్రపంచ రికార్డు సృష్టించాలని ప్రణాళిక రచించారు.  అందుకు తగట్లు మీడియా సహాయంతో ప్రచారం చేశారు. ఊహించని మద్దతు మైసూరు జిల్లా అధికారులు 50 వేల మందితో యోగా చేయించాలని ఆలోచించారు. అయితే అధికారులు ఊహించని స్థాయి లో స్సందన వచ్చింది. ఇప్పటికే 51,463 మంది తమ పేర్లు నమోదు చేసుకుని అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి సిద్దంగా ఉన్నారు. 
Image result for international yoga day 2015
6 వేల మంది విద్యార్థులు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా యోగా చెయ్యడానికి సిద్దం అయ్యారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఒకే చోట ఆరు వేల మంది విద్యార్థులు పాల్గొనడం ఏంతో సంతోషంగా ఉందని అధికారులు నాడు మురిసిపోయారు.  వీలైనంత మందితో ఒకే చోట యోగా చేయించి గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాధించాలని నిర్ణయించారు. మహిళలకు ప్రత్యేకంగా మైసూరు నగరంలోని చామరాజ, నరసింహరాజ, జయచామరాజ, కృష్ణరాజ ప్రాంతాల్లో ఇప్పటికే యోగా శిక్షణ శిభిరాలు నిర్వహించారు. 
Related image
మొత్తం మీద 50 వేల మందికి పైగా ఒకే చోట యోగా చేసి 2017 జూన్ 21 మరోసారి  ప్రంపంచ రికార్డు సృష్టించింది మైసూరు నగరం. మరి ఈ సంవత్సరం వివరాలు త్వరలో. 

Image result for international yoga day 2015

మరింత సమాచారం తెలుసుకోండి: