అలసిపోయిన శరీరానికి తక్షణ ఉపశమనం పొందాలంటే, ఒక స్పూన్ పంచదారలో రెండు స్పూన్ల పంచదారను కలిపి బాగా మిక్స్ చేసుకుని తీసుకుంటే.. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలసిపోయిన శరీరానికి ఉత్సాహాన్నిస్తుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు... రోజూ అర స్పూన్ జీలకర్రను.. పెరుగులో చేర్చి తీసుకుంటే ఒబిసిటీ మటాష్ అవుతుంది. రాత్రిపూట పెరుగు తీసుకోవాలనుకునేవారు ఓ కప్పు పెరుగులో అర స్పూన్ తేనే, అరస్పూన్ మిరియాల పొడిని కలిపి తీసుకోవాలి. పగటి పూట పెరుగును తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు కలుగుతుంది.

Image result for obesity

కానీ రాత్రి పూట పెరుగును తింటే శరీరంలో మ్యూకస్ ఎక్కువగా వృద్ధి చెందుతుందట. దీని వల్ల జలుబు, అధిక కఫం వంటి సమస్యలు వస్తాయట.
అందుకే రాత్రిపూట పెరుగు తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం మిరియాల పొడి, తేనెను కలిపి తీసుకోవడం ద్వారా జలుబు, కఫం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.


పెరుగును రోజూ తీసుకోవడం ద్వారా శరీరం నుంచి అధిక ఉష్ణం బయటకు వెళ్లిపోతుంది. అంతేకాకుండా జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. కడుపులో మంట తొలగిపోతుంది. శారీరక దృఢత్వం కలుగుతుంది. పెరుగులో పుష్కలంగా లభించే కాల్షియం ఎముకలకు చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Image result for తేనె మిరియాలు పాలు

అల్లం రసంలో ఉడికించిన కోడిగుడ్డు, తేనె కలిపి తీసుకుంటే..
అల్లం రసాన్ని ఓ స్పూన్ తీసుకుని.. అందులో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి నిద్రించే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం సమస్య దూరమవుతుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ రెండేసి యాలకులను తీసుకోవాలి. ఇవి పురుషులకు ఉండే శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయి. సంతాన సాఫల్యత పెరుగుతుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలలో తులసి, లవంగం, టమాట, ముల్లంగి, కోడిగుడ్డు, క్యారట్‌, అల్లం, ఉల్లి, దోసకాయ, ఎర్రమిరియాలు, ఓట్లు, పిస్తా, నట్స్‌, కొబ్బరి, పుట్టగొడుగులు వున్నాయి.

Image result for తేనె మిరియాలు పాలు నిమ్మ

ఇకపోతే.. గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయను పిండి దాని రసం, రెండు స్పూన్ల అల్లం రసం, రెండు స్పూన్ల తేనె, రెండు స్పూన్ల ధనియాల రసం కలిపి ఉదయం పూట తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అల్లం, బెల్లం సమానంగా కలిపి నూరి రోజూ రెండు మూడుసార్లు తీసుకుంటే అరికాళ్లు, చేతుల్లో పొట్టు ఊడటం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: