యోగా.. ఇప్పుడు అందరికీ ఓ ఆరోగ్యసూచిక యోగా.. ఇప్పుడు అన్ని సమస్యలకూ ఓ పరిష్కారం. యోగా… ఇప్పుడు అందరి అవసరం. ‘యోగా.. ఒంటికి మంచిదేగా..’- అంటూ ఆ మధ్య ఓ సినిమా పాట చెవుల్లో మారుమోగింది. అది నిజమే కూడా. ఇది ఇప్పటిమాటకాదు. భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు చెప్పిన రహస్యం ఇది. అంతకుముందే కొన్నివేల ఏళ్లక్రితం వేదాలూ ఆ మాటే చెప్పాయి. ఆ పాయింట్‌నే పతంజలీ పవర్‌ఫుల్‌గా చెప్పాడు. ఆ తరువాత బుద్ధుడూ అదే చెప్పాడు. కానీ, యోగాపై హిందూమతం ముద్రవేసి దూరంగా ఉంచేశారు. 

Image result for yoga images

కొన్ని దశాబ్దాలుగా క్రమంగా యోగాకు పూర్వవైభవం వస్తోంది. ప్రత్యేకించి ఓ పదేళ్లుగా మరింత ప్రాధాన్యం పెరిగింది. ఆధునిక జీవనశైలి తెచ్చే అనర్థాల నుంచి తెరిపిన పడేందుకు మేలైన, సులువైన మందుగా యోగాను గుర్తించడం ప్రారంభమైంది. భారతీయ యోగాను పశ్చిమ దేశాలు ప్రేమించడం మొదలైంది.

Image result for bolly celebs yoga

సెలబ్రిటీలు, ప్రముఖులు యోగాతో యోగ్యమైన స్థానాలకు చేరుకోవడంతో, ఉత్తమ ఫలితాలు పొందడంతో, మానసిక, శారీరక ఆరోగ్యం సాధించడంతో యోగాకు మంచిరోజులొచ్చాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ యోగాపై చేసిన ఓ కసరత్తు సత్ఫలితాన్నిచ్చింది. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా డేగా ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. భారతీయ యోగాకు అంతర్జాతీయ గౌరవం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: