కొంతమంది పుట్టుకతోనే లివర్ వ్యాధితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఆసుపత్రులకు వెళ్ళి వేల రూపాయలు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే కచ్చితంగా లివర్ వ్యాధుల నుంచి బయటపడొచ్చు. మన శరీరంలో ప్రతి అవయవం ముఖ్యమైనదే. ఆ అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే మనం తినే తిండిపైనే అది ఆధారపడి ఉంటుంది. శరీరంలోని అవయవాల్లో లివర్ కూడా చాలా ముఖ్యమైనది. సాధారణంగా మద్యం అలవాటు ఉన్న వారు లివర్ సంబంధిత వ్యాధుల బారిన పడుతుంటారు.

Image result for liver protect

లివర్ చెడిపోతుంటుంది
అలాగే అతిగా ఆహారం తినడం, జంక్ ఫుడ్, వేపుళ్లు తీసుకోవడం, ఒత్తిడి, ఆందోళన, కాలుష్యం, పనిభారం, పొగతాగడం, మద్యం సేవించడం... వంటి అనేక రకాల కారణాల వల్ల మన లివర్ చెడిపోతుంటుంది. దీంతో ఆ భాగం శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపడంలో విఫలం చెందుతుంది. తద్వారా అనారోగ్యాల బారిన పడతాం.


లివర్ వ్యాధితో బాధపడుతుంటారు
కొంతమంది పుట్టుకతోనే లివర్ వ్యాధితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఆసుపత్రులకు వెళ్ళి వేల రూపాయలు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. 
కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే కచ్చితంగా లివర్ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడొచ్చు.

Related image

ఎండు ద్రాక్ష
ఎండు ద్రాక్ష లివర్ వ్యాధికి బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు కొన్ని ఎండు ద్రాక్షలు తీసుకొని నీటిలో వేసి బాగా కరిగించాలి. ఆ నీటిని ప్రతిరోజు తీసుకోవాలి. ఇలా రెండురోజుల పాటు నాలుగు పూటలు ఎండు ద్రాక్ష తీసుకుంటే చాలా మంచిది. లివర్ శుభ్రం అవ్వడమే కాకుండా వ్యాధులు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలా కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే లివర్ సంబంధిత వ్యాధుల నుంచి బయపడొచ్చు.


పసుపు
లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో పసుపు కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. నిత్యం ఒక గ్లాస్ వేడి పాలలో 1/4 టీస్పూన్ పసుపు కలుపుకుని తాగినా చాలు. లివర్ శుభ్రం అవుతుంది. విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.


నిమ్మ జాతి పండ్లు
నిమ్మ, నారింజ, ద్రాక్ష, గ్రేప్ ఫ్రూట్, కివీ లాంటి విటమిన్ సి ఉన్న పండ్లు తినాలి. వీటిల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను క్లీన్ చేస్తాయి. తరచూ ఈ పండ్లను తింటుంటే లివర్ సమస్యలు రావు. రోజూ ఒక గ్లాస్ వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగినా చాలు. లివర్ క్లీన్ అవుతుంది.


బీట్‌రూట్, క్యారెట్
బీట్‌రూట్, క్యారెట్‌లలో ఫ్లేవనాయిడ్లు, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. లివర్‌ను శుభ్రం చేస్తాయి.


అవకాడోలు
శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపేందుకు లివర్‌కు గ్లూటాథియోన్ అనబడే సమ్మేళనం అవసరం అవుతుంది. అయితే ఆ సమ్మేళనం ఎక్కువ మోతాదులో కావాలంటే అవకాడోలను తినాలి. దీంతో గ్లూటాథియోన్‌ను లివర్ గ్రహించి తద్వారా శరీరంలో ఉన్న వ్యర్థాలను వెంట వెంటనే బయటకు పంపుతుంది.


ఆకుపచ్చని కూరగాయలు
ఆకుపచ్చగా ఉండే ఆకు కూరలు, కూరగాయలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే ఔషధ గుణాలు లివర్‌లో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపి లివర్‌ను శుభ్రం చేస్తాయి. తద్వారా లివర్ పనితనం మెరుగు పడుతుంది.


 రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. రోజుకో ప్రోటీన్ షేక్ తీసుకోవడం కూడా మంచిదే. రోజూ పెరుగు తినే అలవాటు ఉంటే అలాంటి వారి లివర్ దెబ్బ తినకుండా ఉంటుంది. ప్రతి రోజూ ఒక నారింజ పండును తింటే లివర్ ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్‌ను రోజు వారీ ఆహారంలో భాగం చేసుకుంటే లివర్ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు


మరింత సమాచారం తెలుసుకోండి: