1. శరీర భాగాల్ని ఎక్కువగా కదలించండి: 
మీ శరీరంలో కదలికలు తీసుకురావడానికి మార్గాలను అన్వేషించండి. మన అవయవాల కదలికకు ఉపయోగపడే ఎటువంటి వ్యాయామయినా శరీరాన్ని శక్తివంతం చేసే ఒక సాధనంగానే కాకుండా, ఒత్తిడిని తగ్గించే ఒక పరికరంగా కూడా పనిచేస్తుంది.  రోజువారి ఇంటి పనులనుండి, క్రమబధ్ధంగా చేసే సాధారణంగా వ్యాయమం వరకు ఏ విధమయిన శ్రమలు అయినా కూడా మన ఆరోగ్యానికి సహాయపడతాయి.

2. క్రొవ్వు పధార్ధాలను తగ్గించండి.
బజ్జీలు, బోండాలు. పకోడీల వంటి బాగా వేగిన పదార్థాలు ఇంకా ఇతర క్రొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. పాలు, క్రీమ్, వెన్న, జున్ను లాంటి పదర్ధాలు, మరియు పాల ఉత్పత్తులను  తక్కువగా తీసుకోండి. వాటిలో కూడా తక్కువ క్రొవ్వు ఉండేలా చూసుకోవాలి.

3. పొగత్రాగటం మానివేయండి
పొగ త్రాగే అలవాటు మానేయటం వలన, మనం తినే పదార్ధాల యొక్క రుచి, సువాసనలను బాగా గ్రహించ గలుగుతాము. నోటి దుర్వాసన తగ్గుతుంది. దగ్గు నయమవుతుంది. ఇది ఏ వయసు ఉన్న మగవారికైనా, ఆడవారికైనా, లేక ఇంకా ముసలి వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నవారికీ, లేదా ఇప్పటికే అనారోగ్యం పాలయిన వారికీ, ఈ దురలవాటు మానివేయడం ఎంతో మేలు చేకూరుస్తుంది.
పొగత్రాగే అలవాటు వదలివేయటం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇంకా ఇతర క్యాన్సర్ లు,
హృదయరోగాలు, పక్షవాతం, ఇతర ఊపిరితిత్తుల జబ్బులు, శ్వాసకోస రోగాలు  ఇవన్నీ కూడా రాకుండా చాలావరకూ నివారించవచ్చు. 

4. సహకారాత్మకమైన మానసిక ధృక్పధము కలిగి ఉండాలి
సుఖంగా జీవించడం, ఆరోగ్యంగా ఉండడం, జీవితం పట్ల సంతోషకరమయిన అవగాహన ఉండటం అనే అంశాల మధ్య ఒక నిర్దిష్టమైన సంబంధం ఉంది.

5. ఒత్తిడిని అదుపులో పెట్టండి.
ప్రతిరోజూ క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషముల సమయాన్ని మనకు ఇష్టమైన తోటపని, మంచి పుస్తకాలు చదవటం, యోగ, నడక, స్నేహితులను కలిసి మాట్లాడటం, ఇష్టమైన సంగీతం వినటం లాంటి పనుల మీద వెచ్చించాలి.  సహకారాత్మకముగా ఆలోచించటం అనేది జీవితం పట్ల మంచి ధృక్పధం ఏర్పడటానికి దోహదం చేస్తుంది.

6. కాలుష్యము నుండి పరిరక్షించుకోండి
పొగనిండి ఉన్న గదులలో ఉండటం, .ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో శ్వాశ తీసికొనటం నివారించండి. మీరు నివసించే చుట్టుప్రక్కల ప్రదేశాలలో ఎక్కువగా మొక్కలను నాటండి. సరైన ఇంధనము వాడుతూ,  వాహనములను మంచి స్థితిలో ఉండేటట్లుగా చూసుకొని కాలుష్యభరితమైన పొగ రాకుండా చూసుకోవాలి. 

7. అతి మద్యపానం చేయవద్దు.
అతిగా మద్యం సేవించటం  ఆరోగ్యానికి మంచిది కాదు. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు త్రాగటంవలన కూడా కాలేయము, మూత్రపిండాలకు సంబంధిచిన రోగాలు ఇంకా క్యాన్సర్ వంటి జబ్బులతో  మీ ఆరోగ్యం పాడవుతుంది.

8. రోజులో ఎక్కువగా నీరు త్రాగాలి
ప్రస్థుత కాలంలో నీరు పోషక విలువలను అందించే ఒక ముఖ్యమయిన సాధనం. వ్యాయమంచేసి శరీరానికి చెమటలు పట్టిన సందర్భాలలో, మనకు నీటి అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి 68 కే.జీ. లు బరువు ఉన్న ఒక సాధారణ వ్యక్తికి రోజుకి 2.2 లీటర్ల నీరు (కనీసం) అవసరమవుతుంది. చురుకుగా పనిచేసే వ్యక్తికి 3 లీటర్లు లేదా ఇంకా ఎక్కువ నీరు (కనీసం) అవసరమవుతుంది. ఒక గ్లాసు మంచి నీరు త్రాగటం ద్వారా సేదతీర్చుకోవటం చాలా సులభమైన పని మరియు ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: