- ఉప్పు: టాన్సిల్స్ వల్ల వచ్చే నొప్పిని కంట్రోల్ చేయడానికి ఉప్పు చక్కటి పరిష్కారం. కప్పు వేడి నీళ్లలో ఉప్పు వేసి కలపాలి. గోరువెచ్చగా అయిన తర్వాత గొంతులో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల గొంతులో చేరిన బ్యాక్టీరియా నశిస్తుంది. నొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది. 

 - పసుపు: టాన్సిల్స్ సమస్యను తగ్గించడంలో పసుపు చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. గ్లాసు గోరువెచ్చని నీటిలో చెంచా పసుపు కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
- పాలు, పసుపు: రాత్రి పడుకునే ముందు వేడి పాలలో ఒక చెంచా పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపాలి. ఈ మిశ్రమాన్ని మూడు రోజుల వరకు తీసుకుంటూ ఉంటే.. టాన్సిల్స్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. 

 - నిమ్మరసం: టాన్సిల్స్ వాపుతో బాధపడుతున్నప్పుడు విటమిన్ సి పుష్కలంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. కానీ.. విటమిన్ సి లభించే నిమ్మరసం మాత్రం టాన్సిల్స్ సమస్యకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు.. చక్కగా పనిచేస్తాయి. గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసం తీసి, చిటికెడు ఉప్పు, చెంచా తేనె కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. 

 - చెక్క: ఒక గ్లాసు నీటిని వేడి చేసి అందులో చెంచా దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి రోజూ రెండు లేదా మూడు పూటలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. గొంతులో వేధించే నొప్పి, వాపు కూడా తగ్గిపోతాయి.

  - తులసి: తులసిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు టాన్సిల్స్ సమస్యను ఈజీగా తగ్గిస్తాయి. ఒక గ్లాసు నీళ్లలో కొన్ని తులసి ఆకులు వేసి.. 10 నిమిషాలు మరగనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ ద్రావణాన్ని వడగట్టి, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. అవసరమైతే ఒక స్పూన్ తేనె కలుపుకుని తీసుకోవచ్చు. ఇలా మూడు రోజుల పాటు మూడు సార్లు తీసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది. 

 - మిరియాలు: ఒక స్పూన్ మిరియాల పొడి, రెండు స్పూన్ల తేనె తీసుకుని నాలుగు స్పూన్ల వేడినీళ్లలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నాలుగైదు సార్లు ఒక స్పూన్ తీసుకుంటే.. టాన్సిల్స్ నుంచి సత్వర ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: