డాక్డర్‌ ఓ.నాగేశ్వరరావు, గాంధీ ఆసుపత్రిలో దంతవైద్యుడిగా పనిచేశారు.

అందరు డాక్టర్లులాగే తన పనేదో తాను చేసుకొంటూ కాలం గడపకుండా, గత 3 దశాబ్దాలుగా ప్రజల ఊపిరి తిత్తులను తినేస్తున్న సిగరెట్ల పై అలుపు లేని పోరాటం చేస్తున్నారు.

గత పదేళ్లుగా ఏడాదికి నెలరోజుల పాటు నో టుబాకో మంత్‌ని( మే1 నుండి 31వరకు ) జరుపుతూ మారు మూల గ్రామాల నుండి నగరాల వరకు పొగ పీల్చడం వల్ల కలిగే ప్రమాదాలను వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఉదయం పూట పార్కుల నుండి మొదలయ్యే డాక్టర్‌ నాగేశ్వరరావు ప్రచారం షాపింగ్‌ మాల్స్‌, సినిమా ధియేటర్స్‌ వరకు యువతను పలకరిస్తూ ధూమపానం వల్ల కలిగే నష్టాలను వివరిస్తుంటారు. గత నెల రోజులుగా డాక్టర్‌ నాగేశ్వరరావు చేస్తున్న జనహిత ప్రచారం తెలంగాణ ప్రభుత్వాన్ని కదిలించింది. 

ధూమపాన రహిత హైదరాబాద్‌ని తీర్చిదిద్దాలని తాజాగా వైద్య ఆరోగ్య శాఖల నిర్ణయించాయి. 

.బహిరంగ ప్రదేశాల్లో పొగ బంద్‌.. 

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ 'ధూమపాన రహిత' నగరంగా మారనుంది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై కఠినంగా వ్యవహరించడంతోపాటు అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించనున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల హైదరాబాద్‌ పోలీసులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యాచరణను ప్రకటించాయి. పొగాకు వ్యతిరేక దినోత్సవం (మే 31) నుంచి అక్టోబరు 1 వరకూ హైదరాబాద్‌లోని బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, హోటళ్లు, ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో ధూమపానం చేసేవారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు , అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.

Thanks For telangana government

 ''పొగ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 సెకండ్లకు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నారు. స్మోకింగ్‌తో పాటు పొగాకుతో కూడిన గుట్కా కూడా మనిషికి ప్రాణాంతకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పొగాకు వల్ల వచ్చే వ్యాధులపట్ల చైతన్యం కలిగించేందుకు ప్రతి ఏటా మే 31న 'వరల్డ్‌ నో టొబాకో డే'ను పురప్కరించుకొని, మే 1నుండి 31 వరకు పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రతీ పౌరుడికి స్మోకింగ్‌ వలన వచ్చే అనారోగ్య సమస్యలను తెలియజెప్పుతూ, తెలంగాణా వ్యాప్తంగా ర్యాళీలు , సభలు , సమావేశాలు జరిపాం.

మా కృషిని ప్రభుత్వం కూడా గుర్తించి, హైదరాబాద్‌ ని 'ధూమపాన రహిత' నగరంగా మార్చడానికి ముందుకువచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి ధన్యవాదాలు.'' అని డా.రావూస్‌ ఓరల్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ వ్యవస్ధాపకులు డా.ఓ.నాగేశ్వరరావు శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన 'వరల్డ్‌ నో టొబాకో డే' కార్యక్రమంలో చెప్పారు.

 ( పొగతాగడం మానాలనుకునే వారు డాక్టర్‌ నాగేశ్శరరావుగారికి 9849014562 ఫోన్‌ చేసి సలహాలు,కౌన్సిలింగ్‌ పొందవచ్చు. ) 

మరింత సమాచారం తెలుసుకోండి: