ప్రస్తుతం బ్రిటన్‌లో దాదాపు మూడోవంతు మహిళలు గర్భనిరోధక మాత్రలను ఉపయోగిస్తున్నారు.అయితే, పురుషులకు కూడా ఇలాంటి మాత్రలు ఉంటే, వాటిని వేసుకోడానికి మగాళ్లు కూడా సులభంగా అంగీకరిస్తారని చాలా అధ్యయనాల్లో తేలింది.దీనికి సంబంధించిన ఎన్నో అధ్యయనాలు, నివేదికలు చూస్తుంటాం. కానీ ఈ మాత్రలు ఇప్పటికీ మందుల షాపుల్లోకి రాలేదు.బహిరంగంగా ఇంతమంది దానిని అంగీకరిస్తూ, తమ లైంగిక పాత్రలను వదిలించుకుంటున్నతర్వాత కూడా పురుషుల గర్భనిరోధక మాత్రలు వాస్తవానికి తయారవుతాయా అనే ప్రశ్న తలెత్తుతూనే ఉంది.కానీ సర్వేలో పాల్గొన్న 10 మందిలో 8 మంది గర్భం రాకుండా చూసుకోవడం అనేది ఒకరి బాధ్యతే కాదని, మహిళలు, పురుషులు దానిని పరస్పరం షేర్ చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.


అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది వాడే గర్భనిరోధకాలు వివాహితలు లేదా లైంగిక సంబంధాలు పెట్టుకునే మహిళల్లో సుమారు 19 శాతం మంది గర్భం రాకుండా ఉండడానికి వేసక్టమీపైనే నమ్మకం ఉంచుతున్నారు. 14 శాతం మంది మహిళలు కాపర్-టీ ఉపయోగిస్తున్నారు. 9 శాతం మంది మహిళలు గర్భనిరోధక మాత్రలు, ఐదు శాతం మంది ఇంజెక్షన్లు ఉపయోగిస్తున్నారు.పురుషులకు సంబంధించిన గర్భనిరోధకాలను వారు ఉపయోగించడం చాలా తక్కువ. కేవలం 8 శాతం పురుషులు మాత్రమే కండోమ్ ఉపయోగిస్తున్నారు. ఇక రెండు శాతం మంది మాత్రమే వేసక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు అని తెలిసింది. 


ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మహిళలు గర్భనిరోధక మాత్రలు ఉపయోగిస్తున్నారు. యూరప్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో వీటిని అత్యధికంగా వినియోగిస్తున్నారు.అటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికాలో గర్భం రాకుండా ఉపయోగించే వాటిలో గర్భనిరోధక మాత్రలు రెండో స్థానంలో ఉన్నాయి. ఆసియాలో అవి మూడో స్థానంలో ఉన్నాయి.మహిళా హక్కుల్లో వీటిని ఒక కీలక మలుపుగా చెప్పడానికి కారణం కూడా అదే.

అందుకే 20వ శతాబ్దపు అత్యంత ప్రముఖ ఆవిష్కరణల్లో గర్భనిరోధక మాత్రలు కూడా ఒకటిగా నిలిచాయి.సమాజంలో లైంగిక సమానత్వం అనేది పెరుగుతోంది. దాని పరిధి విస్తృతం అవుతోంది. గర్భనిరోధకాల వల్ల, వాటికి సంబంధించిన దుష్ప్రభావాలనే కాకుండా, భావోద్వేగపరమైన, సామాజిక, ఆర్థిక, కాలానికి సంబంధించిన సవాళ్లను కేవలం మహిళలు మాత్రమే ఎదుర్కోవాల్సి వస్తోంది.అలాంటప్పుడు, మనకు పురుషులు ఉపయోగించే గర్భనిరోధక మాత్రలు ఇప్పటికీ ఎందుకు రావడం లేదు.


మహిళల గర్భనిరోధక మాత్రలు వచ్చిన చాలా దశాబ్దాల తర్వాత పురుషుల కోసం అలాంటి మాత్రలు తయారు చేయాలనే ప్రయత్నం మొదలైంది., ఆ తర్వాత నిధుల లోటు ఎదురవడంతో ఆ పరిశోధనలు అటకెక్కాయి.అయితే, పురుషులు ఈ గర్భనిరోధక మాత్రలను స్వాగతిస్తున్నంత మాత్రాన మగాళ్లందరూ వాటిని ఉపయోగిస్తారని కూడా చెప్పలేం.వేసక్టమీ విషయంలో మనం దాన్ని చూడచ్చు. పురుషుల వేసక్టమీ ప్రక్రియ 200 ఏళ్ల క్రితమే మొదలైంది. కానీ పిల్లలు పుట్టకుండా మహిళలకు చేసే ఆపరేషన్లు, పురుషులతో పోలిస్తే పది రెట్లు ఎక్కువగా జరుగుతున్నాయి.పురుషుల గర్భనిరోధక మాత్ర కోసం మనం 50 ఏళ్ల నుంచీ వేచిచూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరో 50 ఏళ్లు ఎదురుచూద్దాం అంటే కుదరదు.



మరింత సమాచారం తెలుసుకోండి: