ఆస్టియోపోరోసిస్  వ్యాధి అనేది సైలెంట్ కిల్లర్ లాంటి వ్యాధి అని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు అంత త్వరగా బయట పడవు అని అంటున్నారు వైద్య నిపుణులు. ఇక ఈ వ్యాధి వారికీ  "బోన్ మాస్" లేదా "బోన్ టిష్యూ" లకు సంబంధించినది అని వైద్యులు తెలియచేస్తున్నారు. దీంతో  ఎక్కువగా ఎముకలు విరిగే అవకాశం ఉంటుంది అని తెలుపుతున్నారు.


ఇక మన భారతదేశంలో ప్రతి ముగ్గురు మహిళల్లో(మెనోపాజ్ తర్వాత) ఒకరికి, అలాగే పురుషులలో  అరవై సంవత్సరాలకుపైబడి వారు ఎక్కువగా ఈ వ్యాధిబారిన  పడతారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఇక వయసు పెరిగే కొద్దీ మనిషి శరీరంలోని ఎముకలు బలహీనంగా మారి పోవడం జరుగుతుంది. అలా బలహీనంగా మారినా ఎముకలు విరిగిపోయే అవకాశం ఉంటుంది అని  వైద్యులు చెపుతున్నారు. ఈ వ్యాధి వలన ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడినప్పుడు ఎముకలు విరిగిపోవడం. ఎక్కువగా చేతులు, కాళ్ళ ఎముకలు విరిగి పోవడం జరుగుతుంది.


ఇక మెనోపాజ్ వస్తే చాలు...ఇలా  జారిపడినా... పుటుక్కున ఎముక విరిగి పోతూవుంటాయి. ఇక అడుగు తప్పినా.... ఫ్రాక్చర్ అవ్వడం కచ్చితం అని అంటున్నారు. ఈ వ్యాధి చాలామందిలో కనిపించే అవకాశాలు ఉన్నాయి అని తెలిపుతున్నారు. కొంచం ముందస్తు జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ సమస్యను చెక్ పెట్టడం సులువే అంటున్నారు నిపుణులు.


మరి  జాగ్రత్తలు చూద్దామా మరి... ఆహారంలో క్యాల్షియం, విటమిన్ డి తగినంతగా ఉండేయిలాగా  చూసుకొని తినాలి. కాబట్టి ఈ పోషకం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. పోషకాహారం తీసుకోవడం వల్ల ఎముక మజ్జ పెరిగి బాగా సాంద్రత పెరుగుతుంది దాని వాళ్ళ ఎముకలు బలహీనంగా మారవు. ఇక రోజువారీ తీసుకునే ఆహారంలో చేపలు, పాలు, గుడ్లు, ఆకుకూరలు, పప్పు దినుసులు వంటివి తీసుకుంటే మంచిది అని తెలిపారు నిపుణులు.  ముందు జాగ్రత్త తగు జాగ్రత్తులు తీసుకుంటే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు అని నిపుణులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: