ఎక్కువ శాతం మహిళలకు  జుట్టు మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.... మన శరీర తత్వాన్ని ముందు తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా ఆహారం తీసుకునే వాటిలో కూడా కొన్ని మార్పులు చేసుకుంటూ ఒత్తిడిని బాగా తగ్గించుకోవాలి. అప్పుడూ మాత్రమే చాలా సమస్యలు సద్దుమణుగుతాయి. ఇక వాత ప్రకృతి...ఈ తత్వం ఉండేవారి శిరోజాలు ఎండిపోయినట్లు, పల్చగా, సన్నగా ఉంటాయి, చివరలు చిట్లుతూ, గరుగ్గా ఉండి, దువ్వితే నిలబడవు, చుండ్రు సమస్య ఇలాంటి సమస్యలు బాగా ఉంటాయి.


ఇలాంటి సమస్యలు ఆంటీని అధిగమించేందుకు గుంటగలగరాకు పూత వాడడం మంచిది. ఇపుడు ఇది ఎలా తాయారు చేసుకోవాలో చూద్దామా మరి... గుంటగలగరాకు, యష్టిమధు, మెంతులు, కచ్చూరాల చూర్ణాన్ని ఇనుప బాణలిలో రెండు లేదా మూడు గంటలు బాగా నాన బెట్టుకోవాలి. మొత్తం ఈ మిశ్రమానికి కొద్దిగా కొబ్బరి నూనెలో పోసి జుట్టు మొత్తం పాయలుగా విడదీస్తూ తలంతా పట్టించుకోవాలి.


ఇక  గంట తరువాత తలపై నీటిని కొంచెం కొంచెంగా పోస్తూ శుభ్రం చేసుకోవాలి. తలలో ఏమాత్రం మూలికల చూర్ణం కూడా మిగలకుండా ఎక్కువ నీటితో స్నానం చేయాలి కాచిత్తంగా. వారానికి ఒకసారి ఈ పూత వేసుకుంటే వెంట్రుకలు చిట్లిపోకుండా మెత్తగా, పట్టులా వస్తాయి అని నిపుణులు తెలుపుతున్నారు. పిత్త ప్రకృతి...ఈ తత్వం ఉండేవారి జుట్టు పల్చగా, దువ్వితే మాత్రం అలాగే నిలబడి ఉంటుంది. వెంట్రుకలు సన్నగా, జిడ్డుగా ఉంటాయి. లేత గోధుమ వర్ణంలో ఉండి, త్వరగా నెరిసిపోతుంది.దీని వల్ల బట్టతల ఎక్కువగా  వచ్చే అవకాశం ఉంది. 


వేపాకు పూత వాడడం వల్ల కూడా జుట్టు బాగా ఉంటుంది. ముందుగా గుంటగలగర, మందార, వేప పచ్చి ఆకులను ముద్దలా చేసుకోవాలి. దీనికి యష్టిమధు, బలా చూర్ణాలను కలిపి పేస్టులా చేసి తలంతా పట్టించు కోవడం చేయాలి. ఇలా చేసాక గంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే చాల మంచిది. కఫ ప్రకృతి వాడడం వల్ల జుట్టు ఒత్తుగా వస్తుంది. వెంట్రుకలు జిడ్డుగా, మందంగా ఉంగరాలు తిరిగి ఉంటాయి. ముదురు గోధుమ రంగులో లేదా నలుపు వర్ణంలో మెరుస్తున్నట్లు కనిపిస్తాయి ఇది వాడడం వల్ల.


మరింత సమాచారం తెలుసుకోండి: