ప్రపంచంలో ప్రస్తుత మానవ సరాసరి జీవిత కలం అరవై సంవత్సరాలని చెప్పవచ్చు. ఎందుకనే ప్రస్తుత ఆహార అలవాట్లు, వాతావరణ పరిస్థితులు ఆలా ఉన్నాయి కాబట్టి. మనిషి జీవితం ఆ అరవై సంవత్సరాలు అన్న ప్రశాంతగా జీవిస్తాడా అంటే అది లేదు. ఎప్పుడు అదో ఒకటి అనారోగ్య సమస్యలతో జీవనం సాగిస్తుంటాం. ప్రస్తుత కాలంలో మానవులు ఎక్కువుగా బాధ పడే రోగాలు అంటి అంటే షుగర్, బిపీ జబ్బులు. విత్తి తర్వాత ఎక్కువుగా భాధ పడే సమస్యలలో కడుపు నొప్పి, కిడ్నీలో రాళ్లు ఉండడం. 


ఇక అసలు విషయానికి వస్తే  మానవ జీవితంలో కిడ్నీలో రాళ్లు వచ్చాయి అంటే ఒకటో లేదా రెండో అనుకొంటాం. కానీ ఒక వృద్ధుడి కిడ్నీల్లో ఏకంగా 45 రాళ్లు ఏర్పడ్డాయి. అవి మూత్రకోశంలోకి వెళ్లాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సిద్దిపేటలోని శంకర్‌ రావు ఆస్పత్రి వైద్యులు ఆ వృద్ధుడికి శస్త్రచికిత్స చేసి విజయవంతంగా వాటిని తొలగించారు.


ఈ వృద్ధుడు రాజన్న సిరిసిల్ల జిల్లా అంతగిరికి చెందిన హనుమంతు (70) కొంతకాలంగా మూత్రకోశంలో వ్యాధితో చాలా బాధపడుతున్నాడు. సిద్దిపేటలోని ఆస్పత్రికి వెళ్లగా స్కానింగ్‌ చేసి రాళ్లు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. వాటిని తొలగించేందుకు వైద్యులు క్యాటర్‌ పైపు వేసి ప్రయత్నించారు కానీ మూత్రకోశం మొత్తం రాళ్లు నిండి ఉండటంతో తొలగించడం కష్టమైంది  డాక్టర్స్ కి. 


దీనితో వేరే మార్గం లేక శస్త్రచికిత్స చేసినట్లు డాక్టర్‌ శంకర్‌ రావు తెలిపారు. సుమారు ఒక కిలో బరువు గల నలబై రాళ్లు బయట పడ్డాయని చెప్పారు. మూత్రకోశం మొత్తం రాళ్లతో నిండటం చాలా అరుదైన విషయమని డాక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆ వృద్ధుడి పరిస్థి నిలకడగా ఉంది అని త్వరలో అతడు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: