శీతాకాలం చల్లగా ఉండవచ్చు. లేకపోతే పలురకాల వ్యాధులతో ప్రాణాలు పోవచ్చు. అయితే నివారించే కొన్ని జాగ్రత్తలతో పాటు అవసరమైనపుడు వైద్య చికిత్సలు కూడా తీసుకుంటే ఆ వ్యాధుల వేధింపులే మనకు ఉండవు. ఈ సీజన్లో ముఖ్యంగా వచ్చే వ్యాధులలో అలర్జిక్‌ రైనైటిస్‌ ఒకటి. వీటి లక్షణాలు గమనిస్తే వరుసగా తుమ్ములు రావడం, ముక్కు కారడం, కళ్లు, ముక్కు దురదగా ఉండడం.
 
సాధారణ జలుబు కాదని ఒకసారి తేలిపోతే, అది అలర్జీ సమస్యేననే నిర్థారణకు వచ్చేయచ్చు. గాలిలో ఉండే కొన్ని రకాల పదార్థాల కారణంగా ముక్కు లోపలి కణజాలంలో వాపు రావడం ఇందులోని ప్రధాన సమస్య. పొగ, దుమ్ము, కాలుష్యాలు, గాలిలో ఉండే ఉన్ని వంటివి మరికొన్ని అంశాలు. సమస్య ఇంకా మామూలుగానే ఉన్నప్పుడు బాహ్యంగా పరిశీలించడం ద్వారానే కనుగొనవచ్చును. లేదంటే అలర్జెన్‌ టెస్ట్‌లు ఖచ్చితంగా చేయించాలి.
 
వీటికి ఉపశమనం కోసం వైద్యంగా చూస్తే యాంటీ హిస్టమిన్‌ మందులు ఈ సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. వీటి ద్వారా అలర్జిక్‌ అంశాలకు అతిగా స్పందించే తత్వం కొత్త మేరకు తగ్గుతుంది. వీటి నివారణ విషయానికి వస్తే మంచు బారిన పడకుండా మార్నింగ్‌ వాక్‌లకు కాస్త లేటుగా వెళ్లాలి. ఉన్ని దుస్తులు ఏడాదిగా స్లోరేజ్‌ లో ఉండి ఉంటే, మీరు ధరించడానికి ముందు వాటిని తప్పనిసరిగా ఉతికి మంచి ఎండలో వాటిని ఉంచిన తరువాతే ఉపయోగించాలి. అలర్జిన్‌ రైనైటిస్‌ తీవ్రంగా ఉన్నప్పుడు శరీరంలో సెన్సిటివిటీని తగ్గించుకునే కొంత శిక్షణ కూడా పొందాలి.
 
ఈ పరిస్థితులలో ఇంకో వ్యాధి ఆస్తమా. ఈ వ్యాధి లక్షణాల విషయానికి వస్తే  గొంతులోంచి పిల్లికూతలు రావడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ పట్టేసినట్లు ఉండడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. శ్వాసకోశాల్లోకి వెళ్లే శ్వాసవాహికల్లోని మ్యూకస్‌ పొర కుంచించుకుపోయి వాపు ఏర్పడటం వల్ల ఈ వ్యాధి తలెత్తుతుంది. ఈ పరిస్థితిలో శ్వాసవాహికల్లో మ్యూకస్‌ అడ్డుపడి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ సమస్య రాత్రివేళల్లో మరీ ఎక్కువగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: