తృణధాన్యాలు, ముడిబియ్యం, రాగి, బార్లీ, జొన్న, వోట్స్ వంటి చిరుధాన్యాలు రుచికరంగా ఉండటమే కాకుండా ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చి బోర్ అనే మాటను పక్కన పెట్టోచ్చు. వంట పద్దతుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు డిఫరెంట్ డిష్లు తయారైపోతాయి. ఎక్కువమందికి రుచికరమైన ఆహారం అంటే వేపుల్లే, కాని ఆవిరికి ఉడికించి, బేకింగ్ చేసి, సన్నని సెగ మీద ఉడికించి, జ్యూస్లు తీసినా కూడా రుచికరమైన ఆహారం సిద్దమవుతుంది. విషయాన్ని గ్రహించరు. ఇవన్నీ రోజూవారీ మన వంటల్లో చోటుచేసుకునే పద్దతులే, వీటినే కాస్త వెరైటీగా అనుసరించాలి. ఇడ్లీలు, ధోక్తా, పాన్ కేక్స్ లాగానే కూరగాయాల్ని కూడా ఆవిరికి ఉడికించి. కూరగాయల్ని రసం తీసి మాక్ టెయిల్ చేసుకుని తాగితే మజానే వేరుగా ఉంటుంది. ఆహారపధార్థాలను రకరకాల పద్దతుల్లో కలిపి తినొచ్చు. దాదాపు అందరికీ చాట్, భేల్ పూరీ వంటివి నచ్చుతాయి. వాటినే ఆరోగ్యంగా తయారుచేసుకుంటే బాగుంటుంది. బంగాళాదుంపల్ని ఉడికించి. మరమరాలు, దానిమ్మ గింజలు ఉడికించిన తెలుపు రంగు శెనగలు , సన్నగా తరిగిన కీరదోసకాయ, టొమాటో, ఉల్లిపాయ ముక్కలు తీసుకుని వీటన్నింటినీ కలిపి చాట్ మసాలా, నిమ్మరసం కలిపి లంచ్ లా తింటే ఆకలీ తీరుతుంది. పొట్ట నిండుగానూ వుంటుంది. పోషకాలను అందించినట్టవుంతుంది. చాట్ తినాలన్న కోరికాతీరుతుంది. ఇలానే ఎన్నో వంటకాలను అందించినట్టవుంతుంది. చాట్ తినాలన్నా కోరికాతీరుంది. ఇలానే ఎన్నో వంటకాలను కొత్తగాతయారుచేసుకోవచ్చు. అందుకనే హెల్తీ ఫుడ్ అనగానే బోర్ అనుకోకుండా కాస్త వెరైటీగా ఆలోచించి తయారుచేసుకుంటే టేస్టీగా కూడా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: