ఎన్నో గంటలు విశ్రాంతి లేకుండా పనిచేశాక, ఆహ్లాదం కోసం ఆరు బయటకు రావడాన్నే క్యాబిన్ ఫివర్ అంటాం. బ్యాంక్, కాలేజీల్లో, నర్సింగ్ హోమ్స్ లో పనిచేసే ఉద్యోగినులకు ఈ లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా పనిచేయడం, వింత ప్రభావాన్ని చూపుతుంది. క్రియేటివిటీ లేని శ్రమతో, టెన్షన్ తో కూడిన వర్క్ మనిషిని దిగజార్చుతుంది.. కాని విచిత్రమేమిటంటే మన ‘భుక్తి’ కొరకు డబ్బు సంపాదించాలంటే నిరర్ధకమైన పనే ఎక్కువ చేయాల్సి ఉంటుంది. మనస్సుకి నచ్చిన పని దొరకడం అదృష్టం. అది అందరికీ దక్కదు. అందుకే మనం నచ్చని పనిని నచ్చేలా తీర్చిదిద్దుకోవాలి. ఓ లేడీ డాక్టర్ ఉంటుంది. పేషెంట్ల సొదివినడం ఆమెకి ఇష్టం వుండదు. వినకపోతే రోగులు మళ్ళీ రారు. తప్పనిసరిగా సుత్తి భరించాలి. అందుకే ఆమె పేషెంట్ల బాధలను, వ్యధలను అక్షర రూపంలోకి మార్చి డాక్టర్ కమ్ రయిత్రి అయింది. ఆమెకు సాహిత్య అకాడమీ అవార్డు కూడా దక్కింది. క్యాబిన్ ఫీవర్ అంటే అదే. మన కష్టతరమైన వృత్తిని ఇష్టతరమైన ప్రవృత్తితో లింక్ పెట్టడమే. ప్రతి మనిషికి ఏదొక రంగంలో ప్రవేశం ఉంటుంది. మనం చేసే ఇష్టం లేని పనితో దానిని రంగరించడమే, ఒకామేకి మెడిసిన్ చేయాలని ఎంతో ఆశ. సీటు రాలేదు. వెటర్నరీ సైన్సులో జాయిన్ అయ్యి గోల్డ్ మెడల్ సాధించింది. పెట్ క్లినక్ పెట్టి లక్షలు ఆర్జించింది. (అదే వీధిలో యంబిబియస్ డాక్టర్లు ఈగలు తోలుకుంటున్నారు.) ఆమె ఆలోచించింది ఒక్కటే. మనుష్యుల డాక్టర్లయినా, డాగ్స్ డాక్టర్లయినా ఇచ్చే మెడిసిన్ ఒక్కటే, పైగా నోరులేని ప్రాణుల బాధను అర్థం చేసుకొని,, ట్రీట్ మెంట్ ఇవ్వడం కత్తిమీద సాములా ఫీలయ్యిందామె, క్యాబిన్ ఫీవర్ నుంచి బయటటికొచ్చిందామె.  

మరింత సమాచారం తెలుసుకోండి: