ఈ ప్రపంచంలో ఏనుగుల మిస్సింగ్ కూడా ఒక సమస్యే కూడా బాగా ఎక్కువే అన్పిస్తుంటది ఒక్కోసారి థాయిలాండ్ లోని థాయ్ జలపాతం వద్ద నున్న గున్న ఏనుగును కాపాడబోయి మరో ఐదు ఏనుగులు మృతి చెందాయి.దాంతో అక్కడికి వచ్చిన అధికారులకు అక్కడ పడి ఉన్న ఏనుగుల మృత కాళేబరాలు కనిపించడంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.ప్రమాదకరమైన ఒక జలపాతం వద్ద ఒక ఏనుగును మరొక ఏనుగు కాపాడే ప్రయత్నంలో మొత్తం ఆరు ఏనుగులు మృతి చెందాయి.

థాయ్‌లాండ్‌లోని ఖావో యాయ్ నేషనల్ పార్క్‌లో ఒక జలపాతం పైనుంచి ఒక ఏనుగు పిల్ల కాలు జారీ పడిన తర్వాత ఈ ఘోరం చోటు చేసుకుందని అంచనా వేస్తున్నారు.పిల్ల ఏనుగును కాపాడేందుకు ప్రయత్నించి మరో ఐదు ఏనుగులు చనిపోయాయి.

సలయేరు వద్ద కొండ అంచు మీద ఆగిపోయిన ఒక ఏనుగును మరో రెండు ఏనుగులను థాయ్ అధికారులు గమనించి వాటిని కాపాడేందుకు ప్రయత్నం చేసి విజయం పొందారు.

ఉత్తరాంధ్రలో  హాతీల గుంపులు ఎక్కువై అవి చేసే ఆగడాలకు బెంబేలెత్తుతున్న అక్కడి ప్రజలను చూస్తే పాపం అనిపిస్తుంది.

'హేయూ నరోక్ (నరకపు జలపాతం)' అనే ఒక జలపాతం వద్ద జరిగిన ఈ ప్రమాదాలు మునుపు కూడా జరగడం గమనార్హం.

1992లో జలపాతం పైనుంచి పడి ఒక గుంపులోని మొత్తం ఎనిమిది ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి.ఈ ఘటనపై అప్పుడు దేశవ్యాప్తంగా గుస గుసలు వినపడ్డాయి.

ప్రస్తుత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున మూడు గంటలప్పుడు ఘటనా స్థలానికి దగ్గర్లో రోడ్డును ఏనుగుల గుంపు ఒకటి దిగ్బంధం చేసిందని థాయ్‌లాండ్ జాతీయ పార్కులు, వన్యప్రాణులు, మొక్కల సంరక్షణ విభాగం (డీఎన్‌పీ) తెలుపుగా. ఆ తర్వాత అధికారులను రప్పించి వివరంగా చెప్పారు.అధికారులు  గాలింపు చేపట్టాక జలపాతం పాదాల వద్ద మూడేళ్ల పిల్ల ఏనుగు అస్థిపంజరం కనపడటంతో దానికి దగ్గర్లో మరో ఐదు ఏనుగుల అస్థిపంజారాలు కనిపించాయి.

గుంపులో మిగిలిన రెండు ఏనుగుల పరిస్థితిని పరిశీలిస్తున్నామని జాతీయ పార్కు ప్రధానాధికారి కంచిత్ శ్రీనొప్పవన్ స్పష్టంగా జనాలకు అర్థం అయ్యేలా వివరించారు.

ఏనుగుల ప్రాణాలు తీసి చర్మంతో వ్యాపారాలు చేస్తూ ఆసియాలో పెరుగుతున్న దారుణం అంతా ఇంతా కాదు.

తాజా ప్రమాదంపై వైల్డ్‌లైఫ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ థాయ్‌లాండ్ వ్యవస్థాపకుడు ఎడ్విన్ వీక్ తెలియజేస్తూ ఇలా అన్నారు- పరస్పర రక్షణ, ఆహార ప్రయత్నాల వెతుకులాట కోసం ఏనుగులు సాధారణంగా పెద్ద పెద్ద గుంపులుగా తిరుగుతాయని, ఇప్పుడు ఒకేసారి ఆరు ఏనుగులు చనిపోవడం మిగతా రెండు ఏనుగులపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు.ఈ విధమైన సంఘటనలు ఏ మూగ జీవికి కూడా రాకూడదని మనందరం ఆశిద్దాం.మన వంతు బాధ్యతని మనము నెరవేరుద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: