చాలామంది తల్లిదండ్రులు చింతించేది వాళ్ళ పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల, ఎదుగుదల పట్ల. అయితే పిల్లలు బరువు పెరగడానికి కొన్ని ఆహార నియమాలు పాటిస్తే చాలు  పిల్లలు తినే ఆహారాల పట్ల శ్రద్ధ చూపాలి. మన ఇంట్లో ఉండే వాటితో ద్వారా పిల్లల బరువు పెంచటం అనేది ఒక మంచి ఉత్తమ మార్గంగా చెప్పవచ్చు. కింద తెలిపిన సూచనలను వాడి పిల్లల బరువు పెంచే ప్రయత్నం చేయండి. వీటిని పిల్లలు కూడా ఇష్టపడతారు. ప్రోటీన్‌ అధికంగా గల ఆహారాలను తినండి.

 

ప్రోటీన్‌ ఆధికంగా గల ఆహార పదార్థాలు పిల్లల బరువును సులభంగా పెంచుతాయి. గుడ్డు ఛీజ్‌, పీనట్‌ బటర్‌, లేగ్యూమ్స్‌, మాంసం, పెరుగు వంటి ఆహార పదార్థాలు అదనపు ప్రోటీన్‌లను కలిగి ఉంటాయి.పాలు ఎక్కువగా తాగించండి. పిల్లల బరువు పెరగటానికి అందుబాటులో ఉన్న సులభ మార్గం ఎక్కువగా పాలను తాగించటం. ఒకవేళ మీ పిల్లలు పాలు తాగటానికి విముఖత వ్యక్తం చేస్తే, పాలు తాగమని ఒత్తిడి చేయకండి. కేవలం పాలు మాత్రమే కాకుండా, చాలా రకాల మార్గాల ద్వారా పాలను తాగేలా చేయవచ్చు. ముఖ్యంగా, పాలతో కలిపిన వివిధ రకాల షేక్స్‌ లేదా పండ్లు, పాలు కలిపిన షేక్స్‌ వంటి వాటి ద్వారా పాలను తాగేలా చేయవచ్చు. పాలతో చేసిన స్మూతీ లేదా ఐస్‌క్రీమ్‌ లను తయారుచేసి వారికి తాగించండి. పిల్లలు వీటిని తాగటానికి కూడా ఇష్టపడతారు.

 


పిల్లలలో బరువు పెంచే మరొక ఆహర పదార్థం- కిస్మిస్‌. మీ పిల్లలు రోజులో దాదాపు 30 గ్రాముల కిస్మిస్‌ తింటే, వారు సులభంగా బరువు పెరిగే అవకాశం ఉంది.అలాగే  పీనట్‌, బాదం, జీడిపప్పు మరియు ఇతర గింజలు పిల్లల శరీర బరువును పెంచుతాయి. చిప్స్‌ వంటి అనారోగ్యకర ఆహార పదార్థాలకు బదులుగా పిడికెడు గింజలను వారికి ఇవ్వండి. ఖర్బూజ పుష్కలంగా సహజ చక్కెరలను కలిగి ఉంటుంది. మీ పిల్లల కోసం తయారుచేసుకున్న ప్రణాళికలో వీటిని కలపటం ద్వారా వారి బరువు త్వరగా పెరుగుతుంది. ఉడకబెట్టి చిదిమిన బంగాళదుంపకు క్రీం కలిపి మీ పిల్లలకు తినిపించవచ్చు. ఇవి మీ పిల్లల శరీర బరువు పెరగటానికి సహాయపడతాయి. బంగాళదుంపతో పాటూ అధిక కేలోరీలను కలిగి ఉండే కూరగాయాలు, కార్న్‌, పీస్‌ మరియు చిలకడదుంప వంటి వాటిని కూడా పిల్లలకు తినిపించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: